అది జరిగాక నేను చాలా బాధపడ్డాను: హైపర్ ఆది!

హైపర్ ఆది ఈ పేరు వినగానే అతని కామెడీ టైమింగ్ గుర్తుకు వస్తుంది. అతను వేసే పంచులు గుర్తుకు వస్తాయి. బుల్లితెరలో ప్రేక్షకులని అలరిస్తూ…వెండితెరలో కూడా మెల్లమెల్లగా [more]

Update: 2020-05-10 04:06 GMT

హైపర్ ఆది ఈ పేరు వినగానే అతని కామెడీ టైమింగ్ గుర్తుకు వస్తుంది. అతను వేసే పంచులు గుర్తుకు వస్తాయి. బుల్లితెరలో ప్రేక్షకులని అలరిస్తూ…వెండితెరలో కూడా మెల్లమెల్లగా చిన్నిచిన్ని అవకాశాలు చేస్తూ కెరీర్ లో నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆది ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…తనకు ఎదురైనా ఓ ప్రశ్నకు ఓ బాధాకరమైన సంఘటన గురించి చెప్పాడు.

మాది రైతు ఫామిలీ.నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. నాకు చిన్నప్పుడునుండే సినిమాల్లోకి రావాలి అని ఉండేది. ఓ సందర్భంలో నా చుట్టూ ఉన్న వాళ్లకి నా మనసులో మాట చెప్పితే వాళ్ళు నవ్వారు. అప్పుడు చాలా బాధ పడ్డాను. నేనేంటో చూపించాలనుకుని హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి రావడంతో ‘జబర్దస్త్’ లో అవకాశాన్ని సంపాదించుకున్నాను. నాకు జబర్దస్త్ వల్ల చాలా గుర్తింపు వచ్చింది. ఆ షో ద్వారా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. హైదరాబాద్ కి వచ్చిన రెండేళ్లు తరువాత మా ఊరు వెళ్ళాను. అక్కడ నన్ను చూసి చాలామంది ఆనందపడ్డారు. అది ఎప్పటికి మర్చిపోలేను. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా నన్ను చూడటానికి మా ఊరు వచ్చారు. దాంతో నాకు వాళ్లని చూసి  ఆనందాశ్చర్యాలు కలిగాయి అని చెప్పాడు ఆది.

Tags:    

Similar News