డేటింగ్ చేశా అంటున్న హీరోయిన్?

హీరోయిన్స్ అన్నక హీరోలతోనో, లేదంటే బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ అనేది సహజంగా వింటూనే ఉంటాం. ఒకే సినిమాలో కలిసి పనిచేసే హీరో హీరోయిన్స్ చాలామంది డేటింగ్స్ [more]

Update: 2020-09-29 04:54 GMT

హీరోయిన్స్ అన్నక హీరోలతోనో, లేదంటే బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ అనేది సహజంగా వింటూనే ఉంటాం. ఒకే సినిమాలో కలిసి పనిచేసే హీరో హీరోయిన్స్ చాలామంది డేటింగ్స్ అంటూ రచ్చ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజపుట్ తో డేటింగ్ చేసి లవ్ చేసిన కారణముగా రియా చక్రవర్తి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతుంది. సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానికి రియా చక్రవర్తి ఎంత కారణమో దేవుడికే తెలియాలి కానీ.. ప్రస్తుతం సుశాంత్ కి డ్రగ్స్ ఇచ్చిన కారణంగా ఆమె రిమాండ్ కి వెళ్ళింది. వెళ్ళింది ఊరుకుందా? బాలీవుడ్ లో బడా హీరోయిన్స్ పేర్లు బయటపెట్టింది. దీపికా నుండి సారా అలీఖాన్, శ్రద్ద కపూర్, రకుల్ ప్రీత్ పేర్లు ఎన్ సీబీ ఎదుట బయట పెట్టేసింది.

అంతేకాకుండా సారా అలీఖాన్ తో సుశాంత్ సింగ్ డేటింగ్ చేసాడని చెప్పింది. ఆ విషయాన్నీ ఎన్ సీబీ విచారణలో సారా అలీఖాన్ కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఎన్ సీబీ విచారణలో సారా సుశాంత్ సింగ్ తో తాను డేటింగ్ చేసినట్లుగా.. అలాగే తనకి సిగరెట్ కాల్చే అలవాటు ఉంది కానీ.. తాను డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని చెప్పినట్టుగా సమాచారం. తాను డ్రగ్స్ తీసుకోలేదు కానీ.. సుశాంత్ సింగ్ రాజపుట్ డ్రగ్స్ తీసుకునేవాడని చెప్పినట్లుగా తెలుస్తుంది. కేతరనాధ్ షూటింగ్ అప్పుడే సారా అలీఖాన్ – సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ డేటింగ్ లో ఉన్నారని.. ఆ క్రమంలోనే సారా అలీఖాన్ సుశాంత్ సింగ్ రాజపుట్ ఇచ్చే పార్టీలకు హాజరయినట్లుగా ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న న్యూస్. మరి సారా ఎన్ సీబీఐ ఎదుట సుశాంత్ తో తాను కొంత కాలం డేటింగ్ చేశానని.. ఇది వాస్తవమని చెప్పటమే కాదు… సుశాంత్ సింగ్ రాజపుట్ తో కలిసి థాయిలాండ్ వెకేషన్ కి కూడా వెళ్ళినట్లుగా చెప్పిందని అంటున్నారు.

Tags:    

Similar News