నేను మహేష్ సినిమాలోనా?

పవన్ కళ్యాణ్ భార్యగా కన్నా… ఆయన మాజీ భార్య గానే ఎక్కువ ప్రచారం లోకి వచ్చిన రేణు దేశాయ్.. పవన్ తో విడాకులు ఆతర్వాత రోజు వార్తల్లో [more]

Update: 2020-06-30 05:32 GMT

పవన్ కళ్యాణ్ భార్యగా కన్నా… ఆయన మాజీ భార్య గానే ఎక్కువ ప్రచారం లోకి వచ్చిన రేణు దేశాయ్.. పవన్ తో విడాకులు ఆతర్వాత రోజు వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం కూడా జీ తెలుగు కార్యక్రమాలను ప్రమోట్ చెయ్యడమే కాకుండా.. కొన్ని షోస్ కి జెడ్జి గా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా రేణు దేశాయ్ సినెమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది అని..అది కూడా మహేష్ సర్కారు వారి పాట తో అంటూ తెగ హడావిడి సోషల్ మీడియాలో కనబడుతుంది. అయితే నేను మళ్ళీ నటిస్తే మీరు నవ్వకుండా ఉంటారా అని అడుగుతున్నా, రేణు దేశాయ్ మహేష్ సినిమాలో పక్కగా నటిస్తున్నదని అని నమ్ముతున్నారు.

అయితే తాజాగా రేణు దేశాయ్ మహేష్ సినిమాలో మీరు నటిస్తున్నారట అనే న్యూస్ పై స్పందించింది. తాను ఈమధ్యన విన్న రూమర్స్ లో అతి పెద్ద రూమర్ ఇదే. నేను మహేష్ సినిమాలో నటిస్తున్న అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఒకవేళ తనకి పెద్ద సినిమా అవకాశం వస్తే.. తానే ఓ ప్రకటన చేసి ఉండేదాన్ని అని.. అయితే తనకి నటించాలనే కోరిక ఉందని.. అయితే హీరోలకు తల్లిపాత్రలు చేస్తామని అన్నాను కానీ.. హీరోల చిన్నప్పుడు తల్లిపాత్రలు చేస్తా అని చెప్పడంతోనే ఇప్పుడు ఎలాంటి రూమర్స్ వస్తున్నాయని అంటుంది రేణు దేశాయ్. 

Tags:    

Similar News