ఎవరిని వదలవా?

హైపర్ ఆది జబర్దస్త్ లో తనకి నచ్చని వారి మీద, నచ్చిన వారి మీద సెటైర్స్ వెయ్యడమే కాదు…. మెగా హీరోలని చాలామంది ఇమిటేట్ కూడా చేస్తాడు. [more]

Update: 2020-07-26 03:57 GMT

హైపర్ ఆది జబర్దస్త్ లో తనకి నచ్చని వారి మీద, నచ్చిన వారి మీద సెటైర్స్ వెయ్యడమే కాదు…. మెగా హీరోలని చాలామంది ఇమిటేట్ కూడా చేస్తాడు. మెగా హీరోల గెటప్స్ తో హైపర్ ఆది చాల స్కిట్స్ చేసాడు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. అయితే తాజాగా హైపర్ ఆది ఢీ షోలో మహేష్ ని ఇమిటేట్ చేసాడు. ఢీ డాన్స్ షో లో సుడిగాలి సుధీర్ తోనూ, యాంకర్ ప్రదీప్ తోనూ ఆది పంచ్ లు పేలుస్తూ కామెడీ చేస్తుంటాడు. హైపర్ ఆది – వర్షిణిలా కామెడీ కత్తిలా ఉంటుంది. ఇక వచ్చే వారం ధీ షోలో హైపర్ అది వేసిన కామెడీ పంచ్ లు మహేష్ బాబు ని ఇమిటేట్ చేసేవిలా ఉన్నాయి.

వచ్చే వారం ఈటీవీలో ప్రసారం కాబోయే ఢీ డాన్స్ షో ప్రోలో సుధీర్ నా పేరు దయ నాకు లేనిదే అది అంటూ టెంపర్ ఎన్టీఆర్ మాదిరి బిల్డప్‌ని హైప్ చేసే ఎంట్రీ ఇవ్వగా.. దానికి ప్రదీప్ నాకు తెలుసు, నీ పేరు కక్కుర్తి నీకు ఉన్నదే అది అంటూ పంచ్ పేల్చాడు. ఇక హైపర్ ఆది ఎంట్రీ కూడా ఆ భీబత్సంగా ఉంది. భయ్యా.. నేను వచ్చేముందు ఏదో చేస్తున్నారు ఏంటది అంటూ.. మహేష్ బాబు మాదిరి ముక్కు తుడుచుకుంటూ మహేష్ బాబుని ఇమిటేట్ చేశాడు అది. దానికి ప్రదీప్ కూడా నువ్ ఎవరినో ఇమిటేట్ చేస్తున్నావ్ అంటూ ఆదికి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. ఇక ఆది అక్కడితో ఆగకుండా పోకిరిలో మహేష్ చేసిన సీన్స్ నే చేసి చూపిస్తూ ఢీ సెట్ మొత్తం గంతులెయ్యడం చూసి బాబు ఆది ఎవరిని వదలవా అంటున్నారు నెటిజెన్స్.

Tags:    

Similar News