మెగా హీరోలను అడ్డం పెట్టుకుని.. పైకొచ్చావ్ అంటున్న మెగా ఫ్యాన్స్

హైపర్ ఆది గత వారం నాగబాబు పై వేసిన కుదిరింది ఇండైరెక్ట్ పంచ్ ఇప్పడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. జబర్దస్త్ స్కిట్స్ లో పవన్ [more]

Update: 2020-02-12 03:47 GMT

హైపర్ ఆది గత వారం నాగబాబు పై వేసిన కుదిరింది ఇండైరెక్ట్ పంచ్ ఇప్పడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. జబర్దస్త్ స్కిట్స్ లో పవన్ కళ్యాణ్ దగ్గరనుండి నిన్నగాక మొన్న విడుదలైన అల వైకుంఠపురములో సినిమా వరకు మెగా హీరోల గెటప్స్ తోనే స్కిట్స్ చేసుకుని.. మెగా ఫ్యాన్స్ కి బాగా దగ్గరయిన ఆది.. ఇప్పుడు మెగా హీరో నాగబాబు పై వేసిన ఇండైరెక్ట్ పంచ్ బాంబ్ లా పేలింది. రొజాగారిని, అనసూయని నన్ను తీసుకుని వెళ్లి కుదిరింది ప్రోగ్రాం చేసుకో అంటూ నాగబాబు పై హైపర్ ఆది వేసిన పంచ్ కి మెగా ఫ్యాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయ్.

మెగాస్టార్ చిరు సై రా లో గెటప్ వేసావ్, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లా మారి ఎగస్ట్రాలు చేసావ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ గెటప్స్ వేసుకుంటూ.. అన్నయ్య సాంగ్స్ కి డాన్స్ చేస్తూ జబర్దస్త్ స్టేజ్ మీద డబ్బులు సంపాదించే నువ్వు నాగబాబు గారిని అంతమాట అంటావా అంటూ ఆది పై ఫైర్ అవుతున్నారు. నీకు మెగా హీరోల గెటప్స్ సూట్ కాకపోయినా కామెడీ కోసం అలాంటి గొప్ప కారెక్టర్స్ తీసుకుని కామెడీ చేసుకునే నువ్వు నీకు అన్నం పెట్టించిన నాగబాబు పై పంచ్ వేసే దమ్ము ఉందా అంటూ రెచ్చిపోతున్నారు. మరి ఈ టైం లో ఆది గనక మెగా ఫ్యాన్స్ కి దొరికాడా.. కుమ్మి వదిలేసేలా కనబడుతుంది మెగా ఫ్యాన్స్ వ్యవహారం.

Tags:    

Similar News