‘హుషారు’ కు అదే కలిసొచ్చే అంశం

Update: 2018-12-12 03:00 GMT

‘2.0’ లాంటి భారీ సినిమా వచ్చినా మనోళ్లు ఎక్కడ తగ్గకుండా ఆ తరువాతి వారం నాలుగు సినిమాలతో మన ముందుకు వచ్చారు. అయితే నాలుగు చిత్రాలకు డిజాస్టర్ టాక్ దక్కడంతో ‘2.0’ కు ఇంకా ప్లస్ అయింది. ఉదయం ఆట నుండే నాలుగు సినిమాలు నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో వీకెండ్లో జోరు చూపించలేకపోయాయి.

గత వారం రిలీజ్ అయినా నాలుగు సినిమాలతో పోటీ ఎందుకులే అని ఈవారం రెండు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. అవే.. 'హుషారు', 'భైరవగీత'. ప్రేక్షకుల్లో ఈరెండు చిత్రాలపై అంత అంచనాలు లేకపోయినా 'హుషారు' సినిమాకి ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశముంది. ఈసినిమాను ట్రైలర్ , పాటలు యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. కానీ వర్మ ట్రాక్ రికార్డు.. దీనికి తోడు వాయిదాల మీద వాయిదాలు పడటం వల్ల ‘భైరవగీత’ కు అవకాశాలు చాలా తక్కువ.

పైగా ఇది కన్నడ డబ్ మూవీ..వైలెన్స్ వల్ల మనవాళ్లు ఈమూవీ ని ఎంకరేజ్ చేసే పరిస్థితులు లేవు. సో ఈవారం పెద్దగా పోటీ లేకపోవడంతో ‘హుషారు’కు బాక్సాఫీస్ దగ్గర మంచి ఛాన్సే ఉందనిపిస్తోందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ సినిమా ఇప్పుడున్న యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని సమాచారం.

Similar News