హుషారు హుషారుగా వెళ్ళిపోతుంది

గత నెలలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విలయాన్ని నమోదు చెయ్యడమే కాదు.. నిర్మాతలకు రెండింతలు లాభాలు తెచ్చిపెట్టిన హుషారు సినిమా గుర్తుందా… ఎందుకు గుర్తుంటుంది.. ఆ [more]

Update: 2019-01-06 04:04 GMT

గత నెలలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విలయాన్ని నమోదు చెయ్యడమే కాదు.. నిర్మాతలకు రెండింతలు లాభాలు తెచ్చిపెట్టిన హుషారు సినిమా గుర్తుందా… ఎందుకు గుర్తుంటుంది.. ఆ సినిమా చిన్న సినిమా కావడం ఒక కారణమైతే… ఆ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ లేకపోవడం మరో కారణం. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్ అనే కొత్త కుర్రాళ్లు హీరోలుగా నటించిన ఈ సినిమాని శ్రీహర్ష కొనుగంటి డైరెక్ట్ చేసాడు. చిన్న సినిమాగా విడుదలై అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చిన ఈ సినిమాని చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపడ్డాయి.

మీడియా పబ్లిసిటీ లేకపోయినా… మౌత్ టాక్ అండ్ సోషల్ మీడియా ప్రచారంతోనే హుషారు సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ బుల్లి సినిమాని పొరుగు రాష్ట్రమంటే తమిళ తంబీలు తమ భాషలోకి రీమేక్ చేయబోతున్నారట. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆర్జున్ రెడ్డి ని తమిళులు ఎలా రీమేక్ చేస్తున్నారో… ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిన్న సినిమాని అలానే రీమేక్ చేయబోతున్నారు. ఇక ఈ హుషారు తమిళ రీమేక్ కి వివి కతిర్ డైరెక్టర్ గాను జె. ఫణీంధ్ర కుమార్ నిర్మాతగానూ వ్యవహరించనున్నారట. మరి ఇక్కడ చిన్న సినిమాగా పెద్ద హిట్ కొట్టిన హుషారు అక్కడ తమిళంలో కూడా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో అనేది చూడాలి.

Tags:    

Similar News