చిన్న పాత్రైనా… భారీగానే ఉండాలట!!

ప్రభాస్ రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. బాహుబలి క్రేజ్ ని ప్రభాస్ బాగానే వాడేస్తున్నాడు. అందులోనూ బాహుబలి తో బాలీవుడ్ లో బెంచ్ మార్క్ [more]

Update: 2020-10-16 10:41 GMT

ప్రభాస్ రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. బాహుబలి క్రేజ్ ని ప్రభాస్ బాగానే వాడేస్తున్నాడు. అందులోనూ బాహుబలి తో బాలీవుడ్ లో బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నాడు. అందుకే సాహో ప్లాప్ అయినా హిందీ లో మాత్రం ఇరగదీసింది. అంటే హిందీ ప్రేక్షకులు ప్రభాస్ ని ఎంతగా ఆదరిస్తున్నారో తెలిసి ప్రభాస్ ఇకపై పాన్ ఇండియా తప్ప మాములు సినిమాలు చేయాలనుకోవడం లేదు. అందులో భాగంగానే నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు నాగ శ్విన్ సినిమా ని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకుపోవడానికి మూవీ టీం మొత్తం ప్లాన్స్ మీద ప్లాన్స్ చేస్తుంది. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా, మరో కీలక పాత్రకి అమితాబచ్చన్ నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా అన్ని భాషల్లో తెరకెక్కుతుంది కాబట్టి సౌత్ లో ఉన్న తెలుగు, కన్నడ,  తమిళ, మళయాలంలో పేరున్న నటులనే ఈ సినిమాకి తీసుకోబోతున్నారట. చిన్న పాత్రైనా సరే పేరున్న నటుడితో చేయించాలని నాగ ఆశ్విన్ డిసైడ్ అయ్యాడట. ఇప్పటికే తెలుగులో ఓ పేరున్న నటుడితో సంప్రదింపులు స్టార్ట్ అయ్యాయని.. ఒక్కో అకేషన్ కి ఒక్కో నటుడు పేరు బయటికి వచ్చేలా ప్లాన్ చేసిందట టీం. దాని ద్వారా సినిమాపై సోషల్ మీడియాలో క్రేజ్ బాగా పెరుగుతుంది అని నాగ శ్విన్ ఉద్దేస్యమట, ఇక పేరున్న నటులకి కాస్త పారితోషకం ఎక్కువ ఇచ్చయినా చిన్న పాత్రలకు పరిమితం చెయ్యాలని టీం చూస్తుందట. అలాగే సినిమాకి కావల్సిన ట్రెడిషనల్ టచ్, అలాగే గ్లామర్ టచ్ ని తగిన పాళ్ళలో చూపించబోతున్నారట.

Tags:    

Similar News