సంక్రాంతి వేటలో లాభాలే లాభాలు!

ఈ ఏడాది క్రాక్ తో శుభారంభాన్ని ఇచ్చాడు మాస్ మాహారాజ్ రవితేజ. థియేటర్స్ లో 50 పర్సెంట్ అక్యుపెన్సీని లెక్కచేయయకుండా తన సినిమాని రిలీజ్ చేసాడు. క్రాక్ [more]

Update: 2021-01-19 13:25 GMT

ఈ ఏడాది క్రాక్ తో శుభారంభాన్ని ఇచ్చాడు మాస్ మాహారాజ్ రవితేజ. థియేటర్స్ లో 50 పర్సెంట్ అక్యుపెన్సీని లెక్కచేయయకుండా తన సినిమాని రిలీజ్ చేసాడు. క్రాక్ కి కొన్ని సమస్యలొచ్చి మొదటి రోజు విడుదల ఆలస్యమైనా.. ఆ రోజు రెండు షోస్ లేకపోయినా.. మొదటిరోజు కలెక్షన్స్ అంతమాత్రంగా ఉన్నప్పటికీ.. రవితేజ క్రాక్ విడుదలైన ఎనిమిది రోజుల్లోనే లాభాల బాట పట్టింది. అంటే 18 కోట్లకి థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా.. రవితేజ ఫస్ట్ వీక్ లోనే 40 కోట్ల‌కు పైగా గ్రాస్, 23 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టి లాభాల వేటలో పడ్డాడు. ఈజీగా బ్రేక్ ఈవెన్ సాదించేసిన రవితేజ తన కాక్ సినిమాతో బయ్యర్లకు లాభాల పంట పండిస్తున్నాడు.
క్రాక్ సినిమాకి మిక్స్డ్ తోనూ, 50 పర్సెంట్ అక్యుపెన్సీతోను లాభాల పంట పండించడానికి కారణం సంక్రాంతి సినిమాల జోరు తగ్గడమే. రామ్ రెడ్ సినిమాకి మిక్స్డ్ టాక్ పడడం, అలాగే విజయ్ మాస్టర్ సినిమాకి ప్లాప్ టాక్ పడడం తో పాటుగా, అల్లుడు అదుర్స్ కి డిజాస్టర్ టాక్ రావడమే రవితేజ క్రాక్ లాభాలు పంట రావడానికి కారణం. మాస్టర్ సినిమాకి ప్లాప్ టాక్ పడినా విజయ్ క్రేజ్ తో మాస్టర్ నిర్మాత గట్టెక్కేసినట్టే. ఇక రామ్ రెడ్ కూడా రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించినా.. అల్లుడు అదుర్స్ మాత్రం ఇంకా డేంజర్ జోన్ లో ఉంది. అయితే ఈ సోమవారం నుండి రవితేజ క్రాక్ సినిమా కలెక్షన్స్ జోరు తగ్గే అవకాశం ఉంది.

Tags:    

Similar News