ఈ రెండేళ్లు అభిమానులకు పండుగే..!

2019 – 2020లో దేశంలో క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు #RRR, కళాంక్, బ్రహ్మాస్త్ర, మరక్కర్. ఈ సినిమాల గురించి ప్రస్తుతం ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా రాజమౌళి [more]

Update: 2019-03-15 08:51 GMT

2019 – 2020లో దేశంలో క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు #RRR, కళాంక్, బ్రహ్మాస్త్ర, మరక్కర్. ఈ సినిమాల గురించి ప్రస్తుతం ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న #RRR చిత్రం కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 400 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడం విశేషం. ఇక భారీ బడ్జెట్ల చిత్రాల విషయానికి వస్తే సైరా నరసింహారెడ్డి, సాహో, కళాంక్, బ్రహ్మాస్త్ర, మరక్కర్(మలయాళం) చిత్రాల పేర్లు మార్మోగిపోతున్నాయి. తెలుగులో చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అమితాబ్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ నటించడం విశేషం. ఈ సినిమా ఆగస్టు లేదా అక్టోబర్ లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. అలానే ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం దాదాపు 225 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సౌత్ లో ఈ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.

హిందీ, మళయాలంలో కూడా…

ఇక హిందీలో మరో రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున వంటి భారీ తారాగణంతో బ్రహ్మాస్త్ర చిత్రానికి దాదాపు 150 కోట్ల బడ్జెట్ ని కేటాయించారు. 2020లో ఈ సినిమా విడుదల కానుంది. అలానే కరణ్ జోహార్ నిర్మాతగా మరో భారీ మల్టీ స్టారర్ 'కళాంక్' అనే సినిమాలో సంజయ్ దత్, మాధురి దీక్షిత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్ తారాగణంగా అభిషేక్ వర్మ దర్శకత్వంలో నిర్మితం అవుతుంది. దీనికి దాదాపు 80 – 100కోట్ల బడ్జెట్ అవ్వవచ్చని చెబుతున్నారు. ఏప్రిల్ 17న రిలీజవుతోంది. అలానే మళయలంలో దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో మోహన్ లాల్, నాగార్జున, సునీల్ శెట్టి, అర్జున్ షార్జా, సిద్ధిఖి, ప్రభుదేవా, సుదీప్ వంటి భారీ స్టార్లతో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ 'మరక్కర్' సినిమా 2020లో రిలీజ్ కానుంది. ఇలా ఏ ఇండస్ట్రీ చూసినా భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. 2019, 2020 సినీ లవర్స్ కి స్పెషల్ ఇయర్స్ కానున్నాయి.

Tags:    

Similar News