బాలీవుడ్ జనాలు మరీ అంత వెర్రి వాళ్ళా.

ఈ ఏడాది బాలీవుడ్ లో రెండు మూడు మాత్రమే గట్టి సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్, రెండోది వార్ [more]

Update: 2019-11-03 05:12 GMT

ఈ ఏడాది బాలీవుడ్ లో రెండు మూడు మాత్రమే గట్టి సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్, రెండోది వార్ సినిమా. వార్ సినిమా యావరేజ్ టాక్ తోనే 300 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. ఇక సాహో కూడా తెలుగు డబ్బింగ్ వెర్షన్ గా బాలీవుడ్ లో విడుదలైతే దానిని సక్సెస్ చేసేసారు హిందీ ప్రేక్షకులు. కానీ హిట్ టాక్ వచ్చిన సై ర నరసింహారెడ్డికి మాత్రం చుక్కలు చూపించారు. ఇకపోతే గత వారం దీపావళి కానుకగా విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ హౌస్ ఫుల్ 4 సినిమాకి అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది. అయినా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. హిట్ అయితే 300 కోట్ల క్లబ్బు ఖాయమనుకుంటే.. ప్లాపయినా.. సినిమా కలెక్షన్స్ అదుర్స్ అన్న రేంజ్ లో ఉండడం మాత్రం మింగుడు పడని విషయమే.

హౌస్ ఫుల్ మూవీ ఫ్రాంచైజీలో నాలుగవ భాగంగా వచ్చిన హౌస్ ఫుల్ 4 కి దారుణమైన రివ్యూస్ రావడమే కాదు.. ఈ సినిమాని ప్రేక్షకులు కూడా వద్దన్నారు. అయితే క్రిటిక్స్ ఇచ్చిన రెంటింగ్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయంటే అందరిని ఆశ్చర్యంలో పడేస్తుంది. ఈ సినిమా విడుదలైనప్పటినుండి నిన్నటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150కోట్ల వసూళ్లకు చేరువైనట్లు సమాచారం. మరి బాలీవుడ్ ప్రేక్షకులు నిజంగానే వెర్రి వాళ్ళలా ఉన్నారు. లేకపోతె ప్లాప్ టాకిచ్చిన సినిమాని కూడా కోట్లకొట్ల కలెక్షన్స్ రావడానికి వారే కారణం గనక. మరి నిజంగానే హౌస్ ఫుల్ 4 టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది

Tags:    

Similar News