హాట్ యాంకర్స్ అదరగొట్టారు!

Update: 2018-07-25 08:42 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో ఝాన్సీ, ఉదయభాను లాంటి యాంకర్స్ హవా తగ్గిపోయింది. ఆదే సమయంలో అనసూయ, రేష్మి లు బాగా పాపులర్ అయ్యారు. వారిద్దరూ హాట్ యాంకర్స్ గా అంతగా పాపులర్ అవడానికి కారణం కేవలం ఈటివి ఛానల్ లో వస్తున్న జబర్దస్త్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాం ద్వారానే అనసూయ ఒక్కసారిగా టాప్ పొజిషన్ లోకి వచ్చేసింది. అలాగే రష్మీ కూడా అంతే. జబర్దస్త్, ఢీ ప్రోగ్రామ్స్ ద్వారా బాగా పాపులర్ అవడమే కాదు.. సినిమా లో హాట్ హీరోయిన్ గా తన లక్కుని పరీక్షించుకుంటుంది. ఇక అనసూయ అయితే సినిమాల్లోని స్పెషల్ కేరెక్టర్స్ తో అదరగొట్టేస్తుంది. అనసూయ, రేష్మి లు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా.

ఇద్దరు కలిసి ఇరగదీశారు...

అయితే తాజాగా ఈ ఇద్దరు హాట్ ఫ్రెండ్స్ కలిసి ఒక డాన్స్ కి వేసిన స్టెప్స్ అంతా ఇంత కాదు.. రెండు కళ్ళు చాలవు చూడడానికి అన్నట్టుగా ఉంది ఆ డాన్స్ వీడియో. బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన ఐటం సాంగ్ బాబూజీ జరధీరే చలో పాటకు అనసూయ, రష్మిలు ఇద్దరు కలిసి డ్యాన్స్ ఇరగదీసారు. వాళ్లిద్దరూ వేసిన ఆ డాన్స్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ లా పాకేసింది. మరి నిజంగా ఆ సాంగ్ కి ఈ హాట్ భామలిద్దరూ వేసిన స్టెప్స్ చూస్తుంటే.. ఒకరు మీద ఒకరు పోటీ పడినట్లుగా అదరగొట్టారు. మరి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ అనసూయ మాత్రం హీరోయిన్స్ లాంటి అందం మెయింటింగ్ చేస్తుంది.

ఎవరూ తగ్గడం లేదుగా...

ఇక రష్మీ గౌతమ్ అయితే 38 ఏళ్ల వయస్సులోనూ తన ఫిట్ బాడీతో హాట్ హాట్ గా చెలరేగిపోతుంది. మరి ఈ వయసులోనూ రష్మీ మెయింటినెన్స్ చూస్తే మాత్రం అమ్మో నిపిస్తుంది. ఇక అనసూయ, రష్మీ గౌతమ్ ల హాట్ హాట్ డాన్స్ స్టెప్స్ ని మీరు యూట్యూబ్ లో ఓ లుక్ వెయ్యండి.

Similar News