షాపింగ్ అంటే చిరాంకంటున్న హీరోయిన్?

రకుల్ ప్రీత్ అనగానే ఫ్యాషన్ ఐకాన్, ఫిట్నెస్ రాణి అంటారు. ఎందుకంటే జిమ్ లో తెగ వర్కౌట్స్ చేసి బాడీని ఎప్పుడు షేప్ గా ఉంచుకునే రకుల్ [more]

Update: 2019-11-15 08:46 GMT

రకుల్ ప్రీత్ అనగానే ఫ్యాషన్ ఐకాన్, ఫిట్నెస్ రాణి అంటారు. ఎందుకంటే జిమ్ లో తెగ వర్కౌట్స్ చేసి బాడీని ఎప్పుడు షేప్ గా ఉంచుకునే రకుల్ ప్రీత్ కి డ్రెస్ సెన్స్ కూడా ఎక్కువే. ఏ అవార్డ్స్ ఫంక్షన్స్ కి వెళ్లినా, ఏ సినిమా ఈవెంట్ కి హాజరైనా రకుల్ తదైనా డ్రెస్సులతో మత్తెక్కిస్తోంది. లాంగ్ ఫ్రాక్స్, హాట్ డ్రెస్సులు ఇలా దేనికదే ప్రత్యేకం అన్నట్టుగా రకుల్ తయారవుతుంది. అయితే ఇంత ఫ్యాషన్ బుల్ గా ఉండే రకుల్ కి షాపింగ్ అంటే చిరాకంటుంది. ఎక్కువ సేపు షాపింగ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవడం తనకి నచ్చదంటుంది ఈభామ. తనకి కావాల్సినవి చక చకా సెలెక్ట్ చేసుకుని వెంటనే షాపింగ్ ముగించేస్తుందట రకుల్. ఇక పార్టీలకు, ఫంక్షన్స్ కి వెళ్లేముందు డిజైనర్స్ తో మాట్లాడి తనకెలాంటి డ్రెస్ కావాలో వాళ్ళకి చెబుతుందట. .

ఇక డిజైనర్స్ తనకు అనువుగా అందంగా ఉండే డ్రెస్ చేసిపెడతారని చెబుతున్న రకుల్… కుటుంబీకుల కోసం, కావాల్సిన వారికోసం మాత్రం కాస్త టైం వెచ్చించి షాపింగ్ చేస్తుందట. ఎందుకంటే తాము బహుమతులుగా ఇవ్వబోయే వస్తువులు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటూ.. కాస్త ఎక్కువ సమయం వెచ్చించి నచ్చిన వస్తువులు కొని ప్రెజెంట్ చేస్తుందట. మరి సినిమాలు ఉన్నా లేకపోయినా రకుల్ ఎప్పుడూ బిజినే. తెలుగులో లేకపోతేనేమి అవకాశాలు బాలీవుడ్ లో ఉన్నాయిగా అనే ధీమా రకుల్ ది.

Tags:    

Similar News