చైతు ఫ్యాన్స్ కు టెన్షన్ పట్టుకుంది..!

Update: 2018-08-11 06:36 GMT

నాగ చైతన్య - అను ఇమ్మాన్యుయేల్ జంటగా రూపొందుతున్న చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మరో వారంలో మొదటి కాపీ రెడీ అయ్యిపోయి సెన్సార్ కి వెళ్లనుంది. ఈరోజు ఉదయం ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు మేకర్స్. 'అను బేబీ' అంటూ సాగే ఈ పాటలో చైతు స్టెప్స్ తో ఇరగతీసాడు. నిమిషం పైనే ఉన్న ఈ వీడియోలో చైతు కొత్తగా కనపడటమే కాకుండా.. డాన్స్ కూడా బాగా చేసాడు. ఇక ఎప్పటిలానే హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ చాలా క్యూట్ గా కనిపించింది.

మాస్ కు గోపి కనెక్ట్ కాలేడా..?

అంతా బాగానే ఉంది కానీ.. సాంగ్ మాత్రం యావరేజ్ గా ఉంది. గోపి సుందర్ ఇచ్చిన ఈ పాట జనాలకి అంతగా ఎక్కలేదనే చెప్పాలి. మాస్ ఆడియన్స్ ను.. మాస్ సినిమాలకు తాను ఎంత మాత్రం సూట్ కానని మరోసారి నిరూపించాడు గోపి సుందర్. మాస్ సినిమాలకి పెట్టింది పేరు దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఇద్దరికీ క్షణం తీరికలేకపోవడంతో దర్శక నిర్మాతలు వేరే ఆప్షన్ లేక గోపి సుందర్ ను తీసుకోవాల్సి వచ్చింది.

మారుతి మ్యాజిక్ చేసేనా..?

గత కొన్ని రోజులు నుండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క గూఢచారి తప్ప సినిమాలు వరసగా ఫెయిల్యూర్స్ వస్తున్న నేపథ్యంలో ఈ నెల 'గీత గోవిందం' , 'శైలజారెడ్డి అల్లుడు' మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ 'శైలజారెడ్డి అల్లుడు' టీజర్ చూస్తే పాత సినిమాల ఫార్ములాలో కనిపించడం.. ఈరోజు రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అంతంత మాత్రంగా ఉండటం ఫాన్స్ ని టెన్షన్ పెడుతోంది. చైతు సినిమా వచ్చి దాదాపు ఏడాది కావొస్తుంది. అతనికి ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. డైరెక్టర్ మారుతి ఏదో మాయ చేసి సినిమాను ఎబోవ్ యావరేజ్ వరకు తీసుకుని వెళ్లగలడు అని నమ్ముతున్నారు. చూద్దాం మరి ఈ అల్లుడు ఎంతవరకు మెరిపిస్తాడో.

Similar News