దసరా కూడా పోతుందేమో అనుకుంటే…!!

ప్రస్తుతం కరోనా విజృంభణతో షూటింగ్స్ మొత్తము ఆగిపోయాయి. ఒకటో ఆరో షూటింగ్స్ చేస్తున్న సెట్స్ లో సిబ్బందికి పాజిటివ్ రావడంతో.. జరగాల్సిన ఆ చిన్న పాటి షూటింగ్స్ [more]

Update: 2020-07-29 05:07 GMT

ప్రస్తుతం కరోనా విజృంభణతో షూటింగ్స్ మొత్తము ఆగిపోయాయి. ఒకటో ఆరో షూటింగ్స్ చేస్తున్న సెట్స్ లో సిబ్బందికి పాజిటివ్ రావడంతో.. జరగాల్సిన ఆ చిన్న పాటి షూటింగ్స్ కి కూడా ప్యాకప్ చెప్పెయ్యల్సి వస్తుంది. ఇక RRR, ఆచార్య, రాధేశ్యాం, పుష్ప, వకీల్ సాబ్ లాంటి పెద్ద సినిమాల షూటింగ్స్ కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు మొదలు కావని అందరూ ఫిక్స్ అవుతున్నారు. అయితే కరోనా ఉధృతి చూసి థియేటర్స్ కూడా ఇప్పుడే తెరుచుకోవు.. తెరుచుకున్న థియేటర్స్ కి ప్రేక్షకులు రారు.. కాబట్టే ఇప్పటికే  షూటింగ్ ఫినిష్ చేసుకున్న సినిమాలన్నీ సైలెంట్ గా ఓటీటీకి అమ్ముడుపోతే బెటర్ అంటూ వార్తలు రావడం.. నాని వి, రామ్ రెడ్, అనుష్క నిశ్శబ్దం, వైష్ణవ తేజ్ ఉప్పెన లాంటి సినిమాలు ఓటిటి ఆఫర్స్ కి తలొగ్గాల్సిందే అన్నారు. దానితో దసరా సీజన్ కూడా ఖాళీ అనుకున్నారు.

అయితే కేంద్రం ఇచ్చిన 25 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ తెరవొచ్చని.. 3.ఓ మార్గదర్శకాల్లో తెలిపింది . దానితో ఇప్పటికే పూర్తయిన సినిమాల నిర్మాతలకు కాస్త టెంక్షన్ తీరింది. సినిమాలు బావుంటే 25 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ నడిచినా.. ప్రస్తుతం విడుదలకు ఓ 10 .. 15 సినిమాలుంటాయి.. మళ్ళీ షూటింగ్స్ పూర్తి చేసుకుని మరొకొన్ని సినిమాలు థియేటర్స్ కి వచ్చేటప్పటికీ.. మా సినిమాల డబ్బు మాకు వస్తుంది, హీరోల క్రేజ్ పెరుగుతుంది అని అనుకుంటున్నారట. మరోపక్క దసరా బరిలో దింపితే బావుంటుంది అని కొంతమంది హీరోలు అనుకుంటుంటే.. ప్రస్తుతం లాక్ డౌన్ సామి.. ఎప్పుడైతే ఏమిటి థియేటర్స్ ఓపెన్ అయినాయి చాలు అంటున్నారట. ఆగష్టు 1 నుండి థియేటర్స్ తెరుచుకుంటే.. ప్రేక్షకులు మెల్లగా సినిమాలకు అలవాటు పడేసరికి దసరా సీజన్ వచ్చేస్తుంది. సో అప్పుడే తమ సినిమాలను విడుదల చెయ్యడానికి హీరోలు ఆలోచిస్తున్నారట. 

Tags:    

Similar News