హని మూన్ కూడా పబ్లిసిటీనేనా?

కాజల్ అగర్వాల్ కరోనా టైం లో ప్రియుడు గౌతమ్ కిచ్లు ని సింపుల్ గా వివాహమాడింది. ప్రస్తుతం కాజల్ – గౌతమ్ ల జంట హాని మూడ్ [more]

Update: 2020-11-12 16:34 GMT

కాజల్ అగర్వాల్ కరోనా టైం లో ప్రియుడు గౌతమ్ కిచ్లు ని సింపుల్ గా వివాహమాడింది. ప్రస్తుతం కాజల్ – గౌతమ్ ల జంట హాని మూడ్ లో ఉన్నారు. పెళ్లి కి కాజల్ అగర్వాల్ వేసుకున్న డ్రెస్ దగ్గరనుండి.. ఆమె పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో ఇప్పుడు కాజల్ అగర్వాల్ హాని మూన్ పిక్స్ కూడా అంతే వైరల్ అవుతున్నాయి. గౌత కిచ్లుతో రొమాంటిక్ ఫోజులతో ఫొటోస్ దిగుతున్న కాజల్ ని చూసిన వారు హాని మూన్ కూడా పబ్లసిటీకి వాడేస్తున్నావా కాజల్ అంటున్నారు. మరి హాట్ హాట్ గా కాజల్ అగర్వాల్ బీచ్ లో కలయ తిరుగుతుంది. 

మధ్యలో భర్త గౌతమ్ తో కలిసి ఫొటోలకి ఫోజిస్తుంది. హీరోయిన్స్ అంటేనే పబ్లిసిటీ. కానీ మరీ కాజాల అగర్వాల్ హాని మూన్ సీక్రెట్స్ అన్ని సోషల్ మీడియాలో కనబడుతుంటే.. అది కాస్తా శృతి మించిన ఫీలింగ్ వస్తుంది అంటున్నారు నెటిజెన్స్. హాట్ హాట్ డ్రెస్ లతో కాజల్ రొమాంటిక్ మూడ్ తో భర్త తో కలిసి హాని మూన్ ని భీబత్సంగా ఎంజాయ్ చేస్తుంది. గత నాలుగు రోజులుగా కాజల్ అగర్వాల్ హాని మూన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండర్ వాటర్ రెస్టారెంట్ రూమ్స్ లో కాజల్.. భర్త గౌతమ్ కలిసి ఎంజాయ్ చేస్తూ ఓ రేంజ్ లో రచ్చ చేస్తుంది. మరి మీరు కాజల్ హాని మూన్ పిక్స్ ని ఓ లుక్కెయ్యండి.

Tags:    

Similar News