క్రేజీ హీరోతో… హిట్ డైరెక్టర్..!

ప్రస్తుతం క్రేజీ స్టార్ గా విజయ్ దేవరకొండ దూకుడు మాములుగా లేదు. వరుస సినిమాలనే కాదు.. రౌడీ బ్రాండ్ తోనూ విజయ్ దేవరకొండ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక [more]

Update: 2019-04-09 08:43 GMT

ప్రస్తుతం క్రేజీ స్టార్ గా విజయ్ దేవరకొండ దూకుడు మాములుగా లేదు. వరుస సినిమాలనే కాదు.. రౌడీ బ్రాండ్ తోనూ విజయ్ దేవరకొండ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక విజయ్ సినిమాలకు ఉండే క్రేజ్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కూడా ఉండడం లేదు. అంతలా విజయ్ క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ తో సెట్స్ మీదున్న విజయ్ దేవరకొండ మరో సినిమాని లైన్ లో పెట్టాడు. అయితే తాజాగా మరో దర్శకుడికి విజయ్ సినిమా కమిట్ అయినట్లుగా తెలుస్తుంది. ఫ్యామిలీ బ్యాగ్డ్రాప్ తో హిట్స్ కొడుతున్న నిన్నుకోరి, మజిలీ మూవీస్ డైరెక్టర్ శివ నిర్వాణకు విజయ్ ఓకే చెప్పారంట.

డిసెంబర్ లో సెట్స్ మీదకు

శివ నిర్వాణ.. విజయ్ తో ఒక సినిమా చెయ్యాలని విజయ్ ని కలిశాడనే న్యూస్ ఇప్పుడు వినబడుతుంది. అయితే విజయ్.. మీతో సినిమా తప్పక ఉంటుంది.. కథని సిద్ధం చెయ్యమని.. మంచి కథతో వస్తే మీ సినిమా డిసెంబర్ నుండి మొదలు పెడదామని శివతో చెప్పాడంట. అయినా హిట్ డైరెక్టర్స్ వెంట హీరోలు పడడం సహజం. చిన్న దర్శకులు హిట్స్ వచ్చాక పెద్ద హీరోలను వెతుక్కోవడం పరిపాటి. మరి ఇక్కడ విజయ్, శివ నిర్వాణ విషయంలో అదే జరిగింది. ఇక ఇప్పటివరకు రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో అదరగొట్టిన శివ నిర్వాణ.. విజయ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథ రాయడానికి సమాయత్తమవుతున్నాడట.

Tags:    

Similar News