ఫస్ట్ టైం మెగా క్యాంప్ లో..?

Update: 2018-08-24 06:39 GMT

మహేష్ తో రెండు సినిమాలు, ప్రభాస్, ఎన్టీఆర్ తో తలో సినిమా చేసిన కొరటాల శివ మెగా హీరోలతో మాత్రం నిన్నటి వరకు సినిమాలేమీ చెయ్యలేదు. మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేసే ముందు రామ్ చరణ్ తో కొరటాల మూవీ అని అనడమే కాదు.. సినిమా మొదలైంది కూడా. కానీ అనివార్య కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. అయితే భరత్ తర్వాత కొరటాల శివ రామ్ చరణ్ తోనే సినిమా చేస్తాడనుకుంటే చరణ్.. బోయపాటికి అవకాశమిచ్చాడు. అయితే భరత్ అనే నేను తర్వాత ఖాళీగా ఉన్న కొరటాల శివ మెగా హీరో అల్లు అర్జున్ తో సినిమా ఉంటుంది అనుకునే లోపు ఆశ్చర్యంగా కొరటాల శివకి మెగా స్టార్ చిరుకి సెట్ అయ్యింది. చిరంజీవి సైరా నరసింహ రెడ్డి సినిమా పూర్తి కాగానే కొరటాల శివతోనే సినిమా చెయ్యబోతున్నాడు.

చిరు పుట్టిన రోజు వేడుకల్లో...

కొరటాల కూడా మెగాస్టార్ చిరుకి కమిట్ అవడమే కాదు.. చిరు కోసం కథ కూడా ప్రిపేర్ చెయ్యడంలో తలమునకలై ఉన్నాడు. ఇక ఈ సినిమాలో కొరటాల శివ చిరుని రెండు పాత్రల్లో చూపిస్తాడని... అలాగే ఇప్పటికే చిరంజీవి కోసం హీరోయిన్ ని వెతికే పనిలో కొరటాల ఉన్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో కొరటాల శివ మొదటిసారి మెగా క్యాంప్ లో కనిపించాడు. ఇంతకుముందు భరత్ పార్టీలో రామ్ చరణ్ తో కొరటాల కలిసినా.. తాజాగా అల్లు వారింట జరిగిన చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ తో సినిమాలు చేసిన దర్శకులతో పాటు కొరటాల శివ కూడా జాయిన్ అయ్యాడు. మరి మెగాస్టార్ తో సినిమా ఫిక్స్ అయ్యాక కొరటాల ఇలా మొదటిసారి మెగా క్యాంప్ లో దర్శనమివ్వడం మెగా ఫాన్స్ కి పండగలా ఉంది. మరి కొరటాల శివ చేసిన నాలుగు సినిమాలు బంపర్ హిట్స్ ఆయే... అందుకే చిరు సినిమా కూడా హిట్ అని ముందే ఫిక్స్ అయ్యారు మెగా ఫాన్స్.

Similar News