అయ్యో పాపులర్ అవుతుందనుకున్నారే

హిప్పీ సినిమాలో కార్తికేయ కి జోడిగా నటించిన దిగంగన సూర్యవంశీ గురించి హిప్పీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గుండ్రని [more]

Update: 2019-06-07 06:11 GMT

హిప్పీ సినిమాలో కార్తికేయ కి జోడిగా నటించిన దిగంగన సూర్యవంశీ గురించి హిప్పీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గుండ్రని మొహంతో, మత్తెక్కించే కళ్ళతో, అందమైన శరీరాకృతి తో హాట్ యాంగిల్ అయినా తగ్గనని చెప్పే ఆమె వాలకం అన్ని సమపాళ్లలో రంగరించి కలగలిపిన దేవతలా దిగంగన సూర్యవంశీ ఉందని.. హిప్పీ సినిమా గనక హిట్ అయితే ఈ అమ్మాయి కూడా క్లిక్ అవుతాడని అన్నారు. మరి నిజంగానే చూడగానే ఆకర్షించే అందంతో దిగంగన సూర్యవంశీ ఈ తరం హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చేలా కనబడింది. సినిమా విడుదలకు ముందు హిప్పీ ప్రీ రిలీస్ ఈవెంట్ తర్వాత దిగంగన సూర్యవంశీ టాపిక్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ గా నడిచింది.

మరి నిన్న ప్రేక్షకులముందుకు వచ్చిన హిప్పీ సినిమాకి కనీసం మిక్స్డ్ టాక్ కూడా పడలేదు. సినిమాకి ప్లాప్ టాక్ రాగా అందులో కార్తికేయ కి జోడిగా నటించిన దిగంగన సూర్యవంశీ కి మంచి మార్కులు పడుతున్నాయి. కార్తికేయ కేరెక్టర్ తో ఆడుకునే అమ్మాయిగా దిగంగన సూర్యవంశీ చక్కని నటనను కనబర్చింది. అందమైన నటన, అందం తో ఆకట్టుకుంది దిగంగన సూర్యవంశీ. కొన్ని యాంగిల్స్ లో అందంగా కనిపించింది. మరి ఈ సినిమా హిట్ అయితే గనక దిగంగన సూర్యవంశీ కి మరిన్ని అవకాశాలైతే వచ్చేవి. యంగ్ హీరోల కన్ను దిగంగన సూర్యవంశీ మీద పడేది. కానీ హిప్పీ టాక్ తో దిగంగన సూర్యవంశీ నష్టపోయేలా కనబడుతుంది

Tags:    

Similar News