హిందీ RX100 హీరోగా ఎవరంటే..?

Update: 2018-09-25 07:40 GMT

బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలుగా విడుదలైన అర్జున్ రెడ్డి సూపర్ బ్లాక్ బస్టర్ అయితే.. ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన RX100 మూవీ హిట్ అయ్యింది. అందుకే ఈ సినిమాలకు ఇతర భాషల్లో మంచి క్రేజ్ ఎర్పడింది. ఇప్పటికే అర్జున్ రెడ్డి తమిళంలో వర్మగా, హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అవుతున్నాయి. ఇక అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన RX100 కూడా ఇతర భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అర్జున్ రెడ్డి సినిమా తమిళ్, హిందీ రీమేక్ లకు మంచి రేటు పలికింది. ఇక RX 100 కూడా హిందీ వాళ్లు కోటిన్నరతో రీమేక్ రైట్స్ కొనుగోలు చేశారు. హౌస్‌ఫుల్ సిరీస్ తో నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న సాజిద్ నాదియ‌ద్ వాలా ఆర్‌ఎక్స్ 100 హిందీ రైట్స్‌ దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమా హిందీ రీమేక్ లో హీరో సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడని ప్రచారం మొదలైంది.

మొదటి సినిమాలే ఇటువంటివా..?

ఆహాన్ శెట్టి వయస్సు కేవలం 22 ఏళ్లే కావడం గమనార్హం. ఎంతో ఫ్యూచర్ ఉన్న సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి ఇలా బోల్డ్ కంటెంట్ తో హీరోగా పరిచయం కావడం అనేది కాస్త ఆలోచించదగిన విషయం. అయితే తమిళంలో అర్జున్ రెడ్డి రీమేక్ లో తమిళ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ కూడా ఇలానే బోల్డ్ కంటెంట్ ఉన్న అర్జున్ రెడ్డి రీమేక్ తోనే పరిచయం అవుతున్నాడు. మరి యంగ్ హీరోలుగా ఇండస్ట్రీని ఎలాల్సిన హీరోలంతా ఇలా వైల్డ్ లవ్ స్టోరీస్ ని ఎంచుకుని తప్పుచేస్తున్నారా.? లేదా.? అనేది ఆ సినిమాల ఫలితాలను బట్టి ఉంటుంది. కాకపోతే అర్జున్ రెడ్డి సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారాడు. మరి ఇలా మొదటి సినిమాతోనే స్టార్ రేంజ్ అందుకోవాలని ఆశపడే.. ఈ యంగ్ హీరోలు ఇలాంటి కంటెంట్ తో వస్తున్నారా అనేదే అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. ఇకపోతే RX100 తమిళ రీమేక్ లో ఆది పినిశెట్టి హీరోగా నటించబోతున్నాడు.

Similar News