కొవిడ్ ఉన్నా బిగ్ బాస్ ఎందుకు చేస్తున్నా అంటే..?

చాలామంది హీరోలు ఇప్పుడు సినిమా షూటింగ్స్ అంటూ కరోనని లెక్కచెయ్యకుండా సినిమా షూటింగ్స్ కోసం సెట్స్ లోకి అడుగుపెట్టేశారు. అయితే అందరికన్నా ముందు తెలుగులో నాగార్జున బుల్లితెర [more]

Update: 2020-09-26 05:34 GMT

చాలామంది హీరోలు ఇప్పుడు సినిమా షూటింగ్స్ అంటూ కరోనని లెక్కచెయ్యకుండా సినిమా షూటింగ్స్ కోసం సెట్స్ లోకి అడుగుపెట్టేశారు. అయితే అందరికన్నా ముందు తెలుగులో నాగార్జున బుల్లితెర లో బిగ్ బాస్ షో హోస్టింగ్ ద్వారా షూటింగ్ మొదలు పెట్టాడు. కరోనా తీవ్రంగా ఉన్న టైం బిగ్ బాస్ ఎందుకు అన్నారు చాలామంది. ఇక తెలుగులో మొదలైన బిగ్ బాస్ హిందీలో అక్టోబర్ 3 నుండి మొదలు కాబోతుంది. సల్మాన్ హోస్ట్ గా సీజన్ 4 ని బిగ్ బాస్ యాజమాన్యం మొదలు పెట్టబోతోంది. అయితే సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఓ రేంజ్ కాదు.. ఎవ్వరూ ఎక్సపెక్ట్ చెయ్యని పారితోషకం అందుకోబోతున్నాడు. ఒక్కో ఎపిసోడ్ కి 12.5 కోట్లు తీసుకోబోతున్నాడని… సో 12 వారాలకు..కలిపి 250 కోట్ల రెమ్యునరేషన్ ని సల్మాన్ ఖాన్ అందుకోబోతున్నాడని బి టౌన్ టాక్.

అయితే తాజాగా సల్మాన్ ఖాన్ తాను కొవిడ్ ఉన్నా ఎందుకు బిగ్ బాస్ చేస్తున్నా అంటే.. కొవిడ్ కారణముగా చాలామంది ఉపాధి కోల్పోయారు. కాబట్టి బిగ్ బాస్ మొదలైతే చాలామందికి ఉపాధి దొరుకుతుంది.చాలామంది బిగ్ బాస్ కి పనిచేయాలి కాబట్టి.. వాళ్లకి ఉద్యోగాలు దొరుకుతాయి కాబట్టే బిగ్ బాస్ చేస్తున్నా అంటున్నాడు. ఇక సల్మాన్ అందుకోబోతున్న 250 కోట్లలోనూ కొవిడ్ కారణంగా కోత పడబోతోంది అనే టాక్ నడుస్తుంది. కొవిడ్ తో ఎదురైనా పరిస్థితులను చక్కబెట్టేందుకు.. సల్మాన్ ఖాన్ పారితోషకంలో కోత పెడుతున్నారట. ఈ విషయాన్నీ సల్మాన్ ఖాన్ కూడా దృవీకరించాడనే టాక్ బి టౌన్ లో మొదలయ్యింది. 

Tags:    

Similar News