స్టార్ డాటర్స్ రెచ్చి పోతున్నారు!

Update: 2018-08-03 06:23 GMT

బాలీవుడ్ స్టార్ డాటర్స్ ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్ కి చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వరసగా స్టార్ డాటర్స్ వెండితెర అరంగేట్రం చేసేస్తున్నారు. నిన్నటికి నిన్న శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ధఢక్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. మంచి మార్కులు కొట్టేసింది. అలాగే ఇప్పుడు శ్రీదేవి - బోని కపూర్ ల చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా సినిమాల్లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కూడా ఇప్పటికే కేదారనాధ్ తో పాటుగా రణవీర్ సింగ్ పక్కన శింబ సినిమాలో నటిస్తుంది.

అదిరే డ్రెస్సుల్లో...

ఇక మరో స్టార్ డాటర్ సినిమాల్లోకి రాకముందే మ్యాగజైన్ కవర్ పేజీలకు ఎక్కేస్తుంది. షారుఖ్ ఖాన్ కూతురు సుహాన ఖాన్ ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఒక మ్యాగజైన్ కోసం సుహానా చేసిన హాట్ ఫోటో షూట్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తుంది. సుహానా హాట్ హాట్ డ్రెస్సులతో ఆ ఫోటో షూట్ కోసం రెచ్చిపోయింది. మరి ఈ పిల్ల కూడా త్వరలోనే వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతుంది. మరి ఇప్పుడు స్టార్ డాటర్స్ ఇలా సినిమాలతోనే కాదు ఒక ఫ్యాషన్ షో కోసం అదిరేటి డ్రెస్సు మేమేస్తే.. అన్నట్టుగా అందమైన డ్రెస్సులతో హాట్ హాట్ గా అదరగొట్టేసారు.

సల్మాన్-కత్రినా కూడా....

బాలీవుడ్ లో పేరున్న ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తయారు చేసిన డ్రెస్సులతో రాంప్ వాక్ తో రెచ్చిపోయారు. జాన్వీ కపూర్ వేసిన హాటెస్ట్ డ్రెస్సు చూస్తుంటే సూపర్ అనేలా ఉంది. మరి అందులో మెరిసిన జాన్వీ మరింత అందంగా ఉంది. ఇక ఖుషి కపూర్ కూడా అందమైన లాంగ్ ఫ్రాక్ లో అదరగొట్టింది. ఇక ధఢక్ హీరో ఇషాన్ కట్టర్ జాన్వీ, ఖుషి లతో అక్కడ ఫ్యాషన్ షోలో హడావిడి చేసాడు. అలాగే సారా అలీ ఖాన్ అయితే అదరగొట్టేసింది. హాటెస్ట్ డ్రెస్సు తో హాట్ అందాలతో సారా అలీ ఖాన్ బీభత్సమైన అందాల ఆరబోతకు దిగడం చూస్తుంటే అప్పుడే గ్లామర్ షో చెయ్యడానికి సారా ముదిరిపోయింది అనిపిస్తోంది. ఇకపోతే మనీష్ మల్హోత్రా ఫ్యాషన్ షోలో మరో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా సల్మాన్, కత్రినా కైఫ్ చేసిన ర్యాంప్ వాక్ నిలిచింది. మరి ఈ ఫ్యాషన్ షోలో స్టార్ డాటర్స్ మెరుపులు మాత్రం తట్టుకోలేకుండా ఉన్నాయంటే నమ్మాలి.

Similar News