చరణ్ ఆఫర్ కే నో చెప్పిన కొత్త హీరోయిన్..?

Update: 2018-08-22 06:13 GMT

ఇప్పుడు టాప్ హీరోయిన్స్ సైతం అవకాశమొచ్చి... అదరగొట్టే పారితోషకం ఇస్తుంటే.. ఐటమ్ సాంగ్స్ చెయ్యడానికి కూడా వెనుకాడడం లేదు. కాజల్ ఎన్టీఆర్ కోసం జనతా గ్యారేజ్ లో ‘నేను పక్క లోకల్’ అంటూ రెచ్చిపోయింది. ఇక తమన్నా అయితే భారీ పారితోషకం ఇస్తే... బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ కోసం రెడీ అవుతుంది. అలా టాప్ హీరోయిన్ ఐటమ్స్ కోసం రెడీ అవుతుంటే.. ఒకే ఒక్క సినిమాతో హిట్ కొట్టి... ప్రస్తుతం ఆఫర్స్ లేని టైం లో స్టార్ హీరో సినిమాలో ఐటెం అవకాశమొస్తే... కళ్లకద్దుకుని ఆ ఆఫర్ ని తీసుకోవాల్సింది పోయి.. రిజెక్ట్ చేసిందట. మరి ఆ పిల్ల ఎవరో కాదు.. RX 100 తో ఒక్కసారిగా లైం టైంలోకొచ్చిన హాట్ సుందరి పాయల్ రాజపుట్.

క్యాస్టింగ్ కౌచ్ పై బాంబు పేల్చి...

RX 100 లో అదరగొట్టే లిప్ లాక్స్ తో అందరి చూపుని తనవైపు తిప్పుకున్న పాయల్ రాజపుట్ కి ఆ సినిమా హిట్ తర్వాత మళ్లీ అలాంటి అంటే RX 100 లోచేసిన ఇందు పాత్రను పోలిన పాత్రలే వస్తున్నాయని అసహనం వ్యక్తం చెయ్యడమే కాదు.. తాజాగా క్యాష్టింగ్ కౌచ్ పై బాంబ్ లాంటి వార్తను పేల్చింది. ఇప్పుడు మరోమారు హాట్ టాపిక్ అయ్యింది. అది కూడా రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో ఐటెం సాంగ్ కోసమే పాయల్ ని సంప్రదించగా.. తాను హీరోయిన్ గా మాత్రమే చేస్తానని.. ఇప్పుడిప్పుడే ఐటెం సాంగ్స్ చెయ్యనని వారిని పంపేసిందట. మరి స్టార్ హీరో సినిమా లో ఐటెం అంటే కళ్లకద్దుకోవడం మానేసి ఇలా రిజెక్ట్ చెయ్యడం చూస్తుంటే పాపకి కాస్త ఎక్కువే అనిపిస్తుంది.

సెకండ్ హీరోయిన్ గానూ చేయనని...

ఇక అఖిల్ - వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోనూ గెస్ట్ రోల్ కోసం పాయల్ ని అడిగితే... గెస్ట్ రోల్స్ వద్దని అందట. ఇక సెకండ్ హీరోయిన్ పాత్రలను పాయల్ రిజెక్ట్ చేస్తుందనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వినబడుతుంది. కాజల్ అగర్వాల్ - బెల్లకొండ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పాయల్ రాజపుట్ ని సంప్రదించడమే కాదు.. అడిగినంత పారితోషకం ఆఫర్ చేసినా... సెకండ్ హీరోయిన్ పాత్రలు చెయ్యనని... తనకి మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఉంటే చెప్పమని దర్శకనిర్మాతలకు చెబుతోందట. మరి ఒక్క సినిమాతోనే చరణ్ లాంటి హీరోకి నో చెప్పిందంటే.... పాయల్ సామాన్యమైన హీరోయిన్ కాదంటున్నారు.

Similar News