నితిన్ కి హీరోయిన్ సమస్య!!

భీష్మ తో హిట్ కొట్టిన నితిన్ కి హీరోయిన్ సమస్యేమిటి అనుకుంటున్నారా.. నితిన్ లాంటి క్రేజీ హీరో పక్కన ఆఫర్ దొరికితే ఏ హీరోయిన్ కూడా వదులుకోరు. [more]

Update: 2020-06-30 08:55 GMT

భీష్మ తో హిట్ కొట్టిన నితిన్ కి హీరోయిన్ సమస్యేమిటి అనుకుంటున్నారా.. నితిన్ లాంటి క్రేజీ హీరో పక్కన ఆఫర్ దొరికితే ఏ హీరోయిన్ కూడా వదులుకోరు. మరి నితిన్ సినిమాలో హీరోయిన్స్ నటించకపోవడానికి కారణం ఏమిటో అనుకుంటున్నారా? అవును నితిన్ భీష్మ బంపర్ హిట్ తో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నితిన్ చందు మొండెడితో ఒకటి.. మరొకటి బాలీవుడ్ అందదున్ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. రంగ్ దే తర్వాత నితిన్ అందదున్ రీమేక్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. అయితే ఆ సినిమాలో నితిన్ కి పోటీగా ఉండే టబు పాత్ర చెయ్యడానికి ఇప్పుడు ఏ మాజీ హీరోయిన్స్ ముందు రావడం లేదు. అందదున్ లో టబు పాత్ర కీలకం అలాగే నెగెటివ్ పాత్ర కావడంతో.. టబు చేసిన బోల్డ్ పాత్ర చెయ్యడానికి ఎవరు ముందు రావడం లేదు.

అయితే ఇంతకుముందు ఆ పాత్ర ని టబునే చేస్తుంది అని, కాదు అనసూయ చేస్తుంది అన్నారు. అలాగే ఇలియానా పేరు వినబడడం ఆమె ఒప్పుకోకపోవడం జరిగింది అని, తాజాగా బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్ప శెట్టి ని సంప్రదించారని టాక్ నడిచింది. అయితే అలంటి పాత్ర చెయ్యడానికి శిల్పనే కాదు.. ఎవరు ముందు రావడం లేదని అంటున్నారు. నితిన్ తో సమానమైన పాత్ర అయినా.. ఆ పాత్ర బాగా నెగెటివ్ గా ఉండడం, అలాగే బోల్డ్ పాత్ర కావడంతో అందరూ భయపడుతున్నారట. అయితే కొన్ని రోజుల ముందు  అపాత్ర కోసం రమ్యకృష్ణ ని సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. భారీగా డిమాండ్ చేసిందట. అందుకే రమ్యకృష్ణ ప్లేస్ లోకీ ఎవరో ఒకరిని తేవాలని కూర్చున్న టీం కి అడుగడుగునా ఆటంకాలే అంటున్నారు.

Tags:    

Similar News