బయోపిక్ కోసం ఆరాటపడుతున్న టాప్ హీరోయిన్..?

Update: 2018-09-28 07:56 GMT

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో బయో పిక్ ల హావా మాములుగా లేదు. తెలుగులో అయితే మహానటి మూవీ అనుకోకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా ఎన్టీఆర్ బయో పిక్ కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక క్రీడాకారుల జీవితాలు కూడా బయోపిక్స్ గా బాలీవుడ్ లో తెరకెక్కిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినవే. తాజాగా తెలుగు క్రీడా తేజం బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా శ్రద్ద కపూర్ హీరోయిన్ గా మొదలైంది. ఇక మరో హైదరాబాదీ సానియా మీర్జా బయోపిక్ పై ఎప్పటినుండో చర్చలు జరుగుతున్నాయి.

ఆసక్తిగా ఉన్న పూజా హెగ్డే...

టెన్నిస్ లో పలు రికార్డులు సృష్టించిన సానియా మీర్జా అందానికి కూడా కొదవలేదు. అలాంటి క్రీడాకారిణి జీవితాన్ని బయోపిక్ రూపంలో తీసుకొచ్చే ఏర్పాట్లు ఎప్పుడో మొదలైనా... ఇప్పటికీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే సానియా మీర్జా బయోపిక్ లో నటించేందుకు ప్రస్తుతం టాలీవడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ఒకరు ఆశపడుతున్నారు. డీజేతో ఒక్కసారిగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి స్టార్ హీరోయిన్ పీఠానికి దగ్గరవుతున్న పూజ హెగ్డే కి సానియా మీర్జా బయోపిక్ లో నటించాలనే కోరిక ఉందట.

వారిద్దరిలో ఎవరి బయోపిక్ అయినా...

ఒక ఇంటర్వ్యూ లో భాగంగా పూజ హెగ్డే తన మనసులోని కోరికను బయటపెట్టింది. సానియా మిర్జా, క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లు తీస్తే నటించాలన్న కోరిక ఉందని... ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా ఆ బయోపిక్స్ లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే ఎన్టీఆర్ అరవింద సమేత లో, మహేష్ మహర్షి లో, ప్రభాస్ తో మరో చిత్రంలోనూ నటిస్తుంది.

Similar News