తెలుగు పిల్ల తెలివైనదేనండోయ్..!

Update: 2018-07-26 06:15 GMT

తెలుగమ్మాయి మెల్లగా బిజీ అవుతుంది. నాని నిర్మాతగా తెరకెక్కిన అ! సినిమాలో వైవిధ్యమైన క్యారెక్టర్ లో దర్శనమిచ్చిన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ నటించిన తాజా చిత్రం బ్రాండ్ బాబు ఆగస్టు 3న విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఆ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈషా రెబ్బ తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయాలన్నీ మీడియాతో పంచుకుంది. ఈషా రెబ్బ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సుబ్రమణ్యపురం సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తున్న ఈషా రెబ్బ తాను చేస్తున్న అరవింద సమేత ముచ్చట్లను వివరించింది. ఇంతకుముందే అరవింద సమేత షూటింగ్ కబుర్లలో ఎన్టీఆర్ సూపర్ అని అంతగాదింతగాదని చెప్పిన ఈషా ఈసారి తన క్యారెక్టర్ అరవింద సమేతలో ఎలా ఉండబోతుందో చెప్పింది.

పేరుకే సెకండ్ హీరోయిన్...

తనది ఏదో అలా వచ్చిపోయే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ మాదిరి కాదని... ఈ సినిమాలో హైదరాబాద్ అమ్మాయిగా కాస్త రూడ్ గా ఉండే కేరెక్టర్ లో నటిస్తున్నానని.. అంతేకాకుండా సినిమా మొత్తం కనబడే రోల్ లో ఎక్కువగా ఎన్టీఆర్ పక్కన వుండే సీన్స్ లో కూడా ఎక్కువగా కనబడతానని.. అలాగే ఈ సినిమాలో చిన్నాచితక క్యారెక్టర్ మాత్రం చెయ్యడం లేదని.. తన పాత్ర నిడివి ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్పింది. మరి ఈషా రెబ్బ అరవింద సమేతలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది అంటే అందరూ ఆమెకేదో చిన్న రోల్ వచ్చిందని.. త్రివిక్రమ్ తన సినిమాల్లో సెకండ్ హీరోయిన్స్ కి ఎలాంటి రోల్స్ ఇస్తాడో అలాంటి సాదాసీదా క్యారెక్టర్ అంటూ బాగా ప్రచారం జరిగింది.

ఈ సినిమానైనా బ్రేక్ ఇస్తుందా..?

మరి ఆ మాటలు ఈషా దాకా వెళ్ళుండొచ్చు. అందుకే అరవింద సమేతలో తన పాత్ర గురించిన విశేషాలన్నీ చెప్పి తన పాత్రపై హైప్ తెచ్చుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఈషా రెబ్బ తెలివైన పిల్లేనండీ. అందుకే ఎన్టీఆర్ సినిమాలో తానో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పి మిగతా దర్శక నిర్మాతలకు వల వేసింది. ఇకపోతే అరవింద సమేత వీర రాఘవ సినిమాలో టైటిల్ రోల్ టాప్ హీరోయిన్ పూజ హెగ్డే చేస్తుంది. ఈ సినిమాపై ఈషా రెబ్బ భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో అయినా బ్రేక్ వస్తుందని ఆశపడుతోంది.

Similar News