స‌హ‌జీవ‌నం పేరుతో చాలానే చేస్తున్నారు..!

ఈ జంటకు పెళ్ళైపోయినట్టే తిరుగుతుంటారు. ఎక్కడకి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్తారు. ప్రస్తుతం లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తున్న వీరు ఆల్మోస్ట్ భార్యాభ‌ర్త‌ల అనుబంధాన్ని మెయింటైన్ [more]

Update: 2018-12-25 06:42 GMT

ఈ జంటకు పెళ్ళైపోయినట్టే తిరుగుతుంటారు. ఎక్కడకి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్తారు. ప్రస్తుతం లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తున్న వీరు ఆల్మోస్ట్ భార్యాభ‌ర్త‌ల అనుబంధాన్ని మెయింటైన్ చేస్తున్నారు. కానీ పెళ్లి చేసుకుంటారో లేదో మాత్రం చెప్పరు. ఏంటి.. ఇంత ఇంట్రడక్షన్ ఎవరికీ అంటారా.. కోలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ న‌య‌న‌తార‌ – విఘ్నేష్ శివ‌న్ గురించే ఇదంతా.

విదేశాల్లో క్రిస్మస్ వేడుకలు

వీరు స‌హ‌జీవ‌నం చేస్తునట్టు కోలీవుడ్ మీడియా సమాచారం. సోషల్ మీడియాలో కలిసున్న ఫొటోస్ పెట్టి తమ బంధాన్ని, అనుబంధాన్ని ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. వీరు ప్రతి ఏడాది క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ కోసం విదేశాలకు వెళ్తుంటారు. అక్కడ ఫొటోస్ తీసుకుని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుంటారు. అలానే ఈసారి కూడా క్రిస్‌మస్ సెల‌బ్రేష‌న్స్ కు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ విగ్నేష్ చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏమీ లేవు. కోలీవుడ్ మొత్తం వీరి పెళ్లి కోసం వెయిట్ చేస్తుంది. మరి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి

Tags:    

Similar News