#RRRకి షాకిచ్చిన హీరోయిన్..?

రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ కాంబోలో #RRR సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉంది. రామ్ చరణ్ కి #RRR సెట్ లో జరిగిన గాయం [more]

Update: 2019-04-06 07:21 GMT

రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ కాంబోలో #RRR సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉంది. రామ్ చరణ్ కి #RRR సెట్ లో జరిగిన గాయం కారణంగా #RRR టీం షూటింగ్ కి మూడు వారాల గ్యాపిచ్చింది. ఇక మొన్నటి వరకు #RRR లో నటించబోయే హీరోయిన్స్,, చరణ్, ఎన్టీఆర్ రోల్స్ పై మీడియాలో నానా హడావిడి నడవగా రాజమౌళి ఒకే ఒక్క ప్రెస్ మీట్ తో చాలామంది ప్రశ్నలకు సమాధానాలు చెప్పేసాడు. రామ్ చరణ్ అల్లూరి సీత రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారని.. చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నారని చెప్పాడు.

సినిమా చేయడం లేదు

ఇక రామ్ చరణ్ సరసన నటించబోయే ఆలియా భట్ ఒక్కసారిగా బాలీవుడ్ నుండి సౌత్ లో ఫెమస్ కాగా… హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ గురించి గూగుల్ సెర్చింగ్ లో ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు. డైసీ ఎడ్గార్ జోన్స్ గురించి ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. ఇంకా ఆమె గురించిన సెర్చింగ్ లో ఉండగానే.. #RRR టీంకి ఆమె పెద్ద షాకిచ్చింది. “దురదృష్టవశాత్తూ నా ఫ్యామిలీలో తలెత్తిన కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను #RRR షూటింగ్ లో పాల్గొనలేకపోతున్నాను. సినిమా స్క్రిప్ట్ చాలా బాగుంది. నిజంగా ఇదొక గొప్ప పాత్ర, రాబోయే రోజుల్లో నా పాత్ర ఎవరు పోషించినా ఆమెకు కూడా అపూర్వ స్వాగతం దక్కుతుంది. యూనిట్ కు ఆల్ ది బెస్ట్” అంటూ డైసీ ఎడ్గార్ జోన్స్ చేసిన ట్వీట్ ఎన్టీఆర్ ఫాన్స్ కి షాకిచ్చింది.

కొత్త హీరోయిన్ ఎవరో..?

మరి డైసీ ఎడ్గార్ జోన్స్ కి ఎలాంటి ప్రాబ్లెమ్ వస్తే ఈ #RRR భారీ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందో కానీ ఇప్పుడు మళ్ళీ మీడియాకి #RRR లో ఎన్టీఆర్ హీరోయిన్ పై పలురకాల ముచ్చట్లకు ఆస్కారం దొరికింది. రాజమౌళి ఎంతో తర్జన భర్జనల తర్వాత చరణ్ కి, ఎన్టీఆర్ కి హీరోయిన్స్ ని సెట్ చేస్తే… ఇప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్ ఝలక్ ఇచ్చింది. మళ్ళీ ఎన్టీఆర్ కోసం ఎలాంటి హీరోయిన్ ని జక్కన్న తీసుకొస్తాడో చూద్దాం.

Tags:    

Similar News