చైతుతో రొమాన్స్ చేసే ఆ హీరోయిన్ ఎవరు..?

Update: 2018-11-23 13:33 GMT

'నిన్నుకోరి' లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మనకు అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య - సమంత నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ రెండు రోజుల కిందటే వైజాగ్ లో పూర్తి చేసుకుంది. మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సమంతతో పాటు మరో హీరోయిన్ కూడా ఇందులో నటిస్తుందంట. తాజా సమాచారం ప్రకారం సెకండ్ హీరోయిన్ కూడా ఉందంట. ఆమె పేరు 'దివ్యాన్షా కౌశిక్'. ఫస్ట్ హాఫ్ మొత్తం నాగ చైతన్యతో రొమాన్స్ చేయనుంది 'దివ్యాన్షా కౌశిక్'. సమంత మెయిన్ హీరోయిన్ అయితే ఈమె సెకండ్ హీరోయిన్ అవుతుంది.

తెలుగుతెరకు కొత్త హీరోయిన్ గా...

ఈమె పాత్ర కోసం దర్శకనిర్మాతలు చాలామందిని చూశారు కానీ ఎవరు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అయితే ఒక ఆడిషన్ లో సమంతనే ఈ అమ్మాయిని ఎంపిక చేసిందట.

ఈనెల 26వ తేదీ నుంచి మరో షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఇందులో దివ్యాన్షా కౌశిక్ జాయిన్ కానుందని చెబుతున్నారు. మరి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఈ అమ్మడుకి మరిన్ని అవకాశాలు రావాలని ఆశిద్దాం. ఈమె పాత్ర సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని చెబుతున్నారు.

Similar News