మహేష్ - సుకుమార్ కి హీరోయిన్ ఫిక్స్..?

Update: 2018-12-08 06:25 GMT

సుకుమార్ కథకి మహేష్ ఇంప్రెస్స్ అవ్వలేదు... మహేష్ ని సాటిస్ఫై చెయ్యలేకపోతున్న సుకుమార్... ఇవి గత నెల నుండి సోషల్ మీడియాలో మహేష్ - సుకుమార్ ప్రాజెక్ట్ మీద వినబడుతున్న రూమర్స్. సుకుమార్ చారిత్రక నేపథ్యంతో ఉన్న కథను మహర్షి షూటింగ్ లో ఉన్న మహేష్ కి వినిపించాడట. అయితే ఆ సినిమా వర్కౌట్ అవ్వదని... మరో కథని సిద్ధం చెయ్యమని మహేష్... సుకుమార్ కి చెప్పినట్లుగా వార్తలోచ్చాయి. మహర్షి సినిమా షూటింగ్ ఫినిష్ కాగానే మహేష్... సుకుమార్ తో సినిమా కోసం రెడీ అవుతాడు. రంగస్థలంతో తిరుగులేని హిట్ కొట్టిన సుకుమార్ మీద భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉండడం.. మహేష్ కూడా రంగస్థలం లాంటి హిట్ కొట్టాలని సుకుమార్ ని టెన్షన్ పెట్టడంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

నాన్నకు ప్రేమతో లాంటి కథనే...

కానీ సుకుమార్ మాత్రం కొత్త కథతో మహేష్ కి లైన్ వినిపించడం.. మహేష్ దానికి ఓకె చెప్పెయ్యడం జరిగిపోయిందని.. అప్పుడే సుకుమార్, మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోకి దూకేశాడని విశ్వసనీయ సమాచారం. ఇక సుకుమార్ మరోమారు నాన్నకు ప్రేమతో కథ లాంటి మైండ్ గేమ్ తరహాలోనే మహేష్ కోసం ప్రిపేర్ చేశాడని... ఇక ఆ సినిమా కోసం మరోసారి మహేష్ సరసన జోడీగా నటించేందుకు రకుల్ ప్రీత్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసాడని అంటున్నారు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన రకుల్.. ఈసారి సుకుమార్ దర్శకుడిగా మహేష్ సరసన నటిస్తుందట.

స్పైడర్ లో నటించినా...

మరి మహేష్ సరసన ఇప్పటికే స్పైడర్ లాంటి డిజాస్టర్ సినిమాలో నటించిన రకుల్... స్పైడర్ తర్వాత టాలీవుడ్ లో సినిమాలు లేక ఖాళీ అయ్యింది. స్పైడర్ తోనే క్రేజ్ పోగొట్టుకున్న రకుల్ ప్రీత్ మరోమారు మహేష్ తో నటించి మళ్లీ క్రేజ్ లోకి వస్తుందేమో చూడాలి. అయితే సుకుమార్ - మహేష్ కాంబోలో రకుల్ హీరోయిన్ అనే విషయం ఇంకా ధ్రువీకరించలేదు.

Similar News