న్యూఇయర్ సెలెబ్రేషన్స్ అక్కడేనట

హీరోయిన్స్ చాలామంది న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం హాలిడే ట్రిప్స్ అంటూ ఏ విదేశాలకో చెక్కేస్తుంటారు. అక్కడ బీచ్ ల వెంట, హోటల్స్ లో పబ్బులు, పార్టీలు. [more]

Update: 2019-12-25 06:36 GMT

హీరోయిన్స్ చాలామంది న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం హాలిడే ట్రిప్స్ అంటూ ఏ విదేశాలకో చెక్కేస్తుంటారు. అక్కడ బీచ్ ల వెంట, హోటల్స్ లో పబ్బులు, పార్టీలు. న్యూ ఇయర్ ని ఫ్రెండ్స్ తోనో, పేరెంట్స్ తోనో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఇయర్ టాప్ మోస్ట్ లో దూసుకుపోతూ… స్టార్ హీరోల సరసన చేరిన రష్మిక మందన్న న్యూస్ ఇయర్ ప్లాన్స్ బయటికొచ్చేశాయి. రష్మిక ప్రస్తుతం నితిన్ సినిమా భీష్మ తో పాటుగా సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ పూర్తి చేసుకుని ఫ్రీ అయ్యింది. నితిన్ భీష్మ షూటింగ్ కోసం రోమ్ వెళ్లిన రష్మిక.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అక్కడే చేసుకోబోతుంది.

రోమ్ నగరంలోనే…

ప్రస్తుతం షూటింగ్స్ తో హడావిడి గా వున్న రష్మిక ఇలా సెలెబ్రటీస్ తో పాటుగా రోమ్ నగరంలో కాస్త రెస్ట్ కూడా తీసుకోబోతుందట. అందుకే భీష్మ యూనిట్ చిత్రీకరణ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చేసినా.. రష్మిక మాత్రం రోమ్ లోనే తిష్ట వేసిందట. అయితే రోమ్ లో న్యూ ఇయర్ ప్లాన్ ని ఇప్పటికిప్పుడే వేసుకోలేదట రష్మిక. దాదాపుగా ఐదు నెలల ముందే రోమ్ లో న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అవడం..ఆనుకోకుండా భీష్మ షూటింగ్ అక్కడే తగలడంతో రష్మిక ప్లాన్ అలా వర్కౌట్ అయ్యింది.

Tags:    

Similar News