రవితేజకి ‘నో’ చెప్పిన హీరోయిన్

హీరో రవితేజ హిట్ అనే పదం విని చాలా ఏళ్ళు అయినట్టు ఉంది. అందుకే తన నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయం ఫుల్ క్లారిటీ గా ఉన్నాడు. [more]

Update: 2019-08-15 13:01 GMT

హీరో రవితేజ హిట్ అనే పదం విని చాలా ఏళ్ళు అయినట్టు ఉంది. అందుకే తన నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయం ఫుల్ క్లారిటీ గా ఉన్నాడు. నెక్స్ట్ ఎటువంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులతో పాటు తన ఫ్యాన్స్ నచ్చుతుందో అటువంటి సినిమాలే చేయాలి డిసైడ్ అయ్యాడు. ఇది దృష్టిలో పెట్టుకునే విభిన్న చిత్రాలు తీసే విఐ ఆనంద్ తో ‘డిస్కోరాజా’ చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. దసరాకు ఈమూవీని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

మహా సముద్రంలో…..

ఈమూవీ తరువాత రవితేజ ‘ఆర్‌ ఎక్స్‌ 100’తో తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్న అజయ్‌ భూపతి తో ‘మహా సముద్రం’ అనే సినిమాలో చేయనున్నాడు. ఇందులో రవితేజ సరసన అదితిరావు హైదరీ నటిస్తున్నట్లు వార్తలు. కానీ లేటెస్ట్ గా ఆమె ప్లేస్ లో రాశి ఖన్నా చేరినట్టు టాక్ వినిపిస్తుంది. ఆదితికి వేరే ప్రాజెక్టులు ఉండటంతో డేట్స్‌ కుదరక ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈమూవీ డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్ధం అవుతుంది. గతంలో రాశి ఖన్నా రవితేజ తో బెంగాల్‌ టైగర్, టచ్‌ చేసి చూడు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు వీరిద్దరికి ఇది మూడో సినిమా.

Tags:    

Similar News