బాలయ్య తో శత్రుత్వం కొనితెచ్చుకుంటున్న హీరోలు

టైటిల్ చూసి ఏదో అనుకునేరు. బాలకృష్ణ లెజెండ్ తో హీరో జగపతి బాబు పవర్ ఫుల్ విలన్ గా మారాడు. బోయపాటి పట్టుబట్టి విలన్ గా ఒప్పించి [more]

Update: 2019-12-14 07:40 GMT

టైటిల్ చూసి ఏదో అనుకునేరు. బాలకృష్ణ లెజెండ్ తో హీరో జగపతి బాబు పవర్ ఫుల్ విలన్ గా మారాడు. బోయపాటి పట్టుబట్టి విలన్ గా ఒప్పించి జగపతి బాబు రీ ఎంట్రీ కెరీర్ ని ఓ లెవల్లో కూర్చోబెట్టాడు. తాజాగా మరో హీరో బాలయ్య కోసం విలన్ గా మారబోతున్నాడట. టాలీవుడ్ లో ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన హీరో శ్రీకాంత్ ఈ మధ్యన సోలో గా చేసిన సినిమాలేవీ హిట్ అవ్వడం లేదు. అయితే ఇప్పటికే ఓ మలయాళ మూవీ తో విలన్ అవతారమెత్తిన శ్రీకాంత్ ఇప్పుడు బోయపాటి – బాలకృష్ణ సినిమా కోసం విలన్ గా మారబోతున్నాడట.

ఇప్పటికే బాలీవుడ్ నుండి సంజయ్ దత్ ని విలన్ గా అనుకుంటున్నా బోయపాటి ఇప్పుడు హీరో శ్రీకాంత్ ని కూడా ఓ నెగెటివ్ రోల్ కోసం సంప్రదించాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. ఇక బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ని బాలయ్య కోసం దింపుతున్నాడనే న్యూస్ నడిచినా.. తాజా సమాచారం ప్రకారం కేథరిన్ ని బాలయ్య కోసం బోయపాటి హీరోయిన్ గా సెలెక్ట్ చేసాడని అంటున్నారు. ఇక శ్రీకాంత్ ని ఎంత పవర్ ఫుల్ గా బాలకృష్ణ ముందు నిలబెడతాడో అంటూ బాలయ్య ఫ్యాన్స్ అప్పుడే శ్రీకాంత్ కేరెక్టర్ ని ఇమేజిన్ చేసుకుంటున్నారు. ఇక హీరో శ్రీకాంత్ హీరో కన్నా ముందు నెగెటివ్ రోల్స్ చాలా చేసాడు. కానీ హీరో అయ్యాక మళ్ళీ విలన్ గా చెయ్యలేదు. మరి బాలయ్య ని ఎదిరించడానికి శ్రీకాంత్ ఎలాంటి పాత్ర వేస్తున్నాడో చూడాలి.

Tags:    

Similar News