వాళ్ళు ముగ్గురే బెస్ట్ అంట

ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ డాన్సర్ ఎవరనగానే చిరు పేరే చెప్తారు. చిరంజీవి బ్రేక్ డాన్స్ గురించే మాట్లాడేవారు. చిరంజీవిని తలదన్నే డాన్సర్ టాలీవుడ్ లోనే లేడు. అయితే [more]

Update: 2019-12-25 06:45 GMT

ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ డాన్సర్ ఎవరనగానే చిరు పేరే చెప్తారు. చిరంజీవి బ్రేక్ డాన్స్ గురించే మాట్లాడేవారు. చిరంజీవిని తలదన్నే డాన్సర్ టాలీవుడ్ లోనే లేడు. అయితే ప్రస్తుతం ఈ జెనరేషన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో పోటీ పడి డాన్స్ చేసే హీరోలే లేరు. ముగ్గురు మూడు డిఫరెంట్ స్టయిల్స్ తో ఇరగదీస్తారు. తాజాగా ఇదే విషయం మెగా హీరో సాయి తేజ్ కూడా ఒప్పుకున్నాడు. ప్రతి రోజు పండగే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సాయి తేజ్ రీసెంట్ గా అలీ తో జాలిగా ప్రోగ్రాం కి రావడం అక్కడ అలీ అడిగిన ప్రశ్నలు సమాధానాలు కాస్త ఫన్నీగానే చెప్పాడు. ఇక మొదటి నుండి చిరంజీవి గారి డాన్స్ కి ఫిదా అయ్యేవాడినని చెప్పిన సాయి తేజ్.. ఇండస్ట్రీలో టాప్ డాన్సర్ ఎవరు అనగానే వెంటనే ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ పేర్లు చెప్పేసాడు.

వారి తర్వాతే …?

డాన్స్ లో ఆ ముగ్గురి తర్వాతే ఎవరైనా అంటూ కితాబునిచ్చేసాడు. ఎన్టీఆర్ , రామ్ చరణ్, అల్లు అర్జున్ డాన్స్ లలో డిఫ్రెంట్ వేరియేషన్స్ ఉంటాయని, ఎన్టీఆర్ క్రేజీగా క్లాసిక్ టచ్ ఇస్తే… రామ్ చరణ్ డాన్స్ చాలా గ్రేస్ ఫుల్ గా ఉంటుందని.. ఇక అల్లు అర్జున్ అయితే… డిఫరెంట్ స్టెప్స్ తో అదరగొట్టేస్తాడని. తన దృష్టిలో ఈ ముగ్గురూ బెస్ట్ డాన్సర్స్ అని ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్ని డాన్స్ లకు సర్టిఫికెట్స్ ఇచ్చేసాడు సాయి తేజ్. ఇక సాయి తేజ్ కూడా మంచి డాన్సర్ అన్న సంగతి ఆయన సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. మేనమామల డాన్స్ స్టెప్స్ ని సాయి తేజ్ యాజిటీజ్ గా చేసేస్తుంటాడు.

Tags:    

Similar News