హీరో రామ్ సమస్యల్లో ఉన్నాడా..?

Update: 2018-08-03 06:21 GMT

ఉన్నది ఒకటే జిందగీతో యావరేజ్ అందుకున్న హీరో రామ్ చాలా గ్యాప్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో నక్కిన త్రినాథ రావు తో హలో గురు ప్రేమ కోసమే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని అక్టోబర్ లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ విషయాలేమీ బయటికి రానివ్వడం లేదు. హలో గురు ప్రేమ కోసమే టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ ని వదిలిన చిత్ర బృందం ఇప్పుడు చాలా సైలెంట్ అయ్యింది. మరి ఈ సినిమా విషయంలో ఏదో జరుగుతుందనే అనుమానం ఇప్పుడు సోషల్ మీడియాలో రైజ్ అయ్యింది.

ఆయననే గట్టిగా అడగండి

అప్పుడప్పుడు రామ్ తన బాడీ ఫిట్నెస్ ని, అలాగే తాను వంట చేస్తున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అయితే రామ్ ట్విట్టర్ లో ఓ అభిమాని రామ్ ని హలో గురు ప్రేమ కోసమే చిత్ర విషయాలను చెప్పమని అడగగా.. దానికి రామ్.. గట్టిగా అక్కడ అడగండి అంటూ దిల్ రాజుని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా ఆ అభిమానికి చెప్పడం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతోంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. అసలు హలో గురు ప్రేమ కోసమే కథ ముందుగా అక్కినేని అఖిల్ దగ్గరికి వెళ్లింది. అఖిల్ నుండి ఆ స్టోరీ తర్వాత రామ్ చేతికి వచ్చింది. మధ్యలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయనుకోండి అది వేరే విషయం.

లైట్ తీసుకుంటున్న దిల్ రాజు

అయితే ప్రస్తుతం లవర్ సినిమా ఫ్లాప్ తో ఉన్న దిల్ రాజు ప్రస్తుతం తన దృష్టి మొత్తం శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రమోషన్స్ మీదే పెట్టాడు. అందుకే దిల్ రాజు... హలో గురు ప్రేమ కోసమే సినిమాని లైట్ తీసుకుంటున్నాడా... లేదంటే మారేదన్న విషయం ఉండా అనేది అర్థమవడం లేదు. కానీ రామ్ చెప్పినదాన్నిబట్టి చూస్తుంటే మాత్రం ఏదో ఉండనే అర్థం వస్తుంది. ఇక ప్రస్తుతం జరిగిన షూటింగ్ తో దిల్ రాజు సంతృప్తిగా లేడని.. అందుకే ఇలా హలో గురుని పట్టించుకోవడం లేదంటున్నారు. మరో పక్క అనుపమకు వరసగా ఫ్లాప్స్ ఉన్నాయి. ఏదైనా ప్రస్తుతం అనుపమ, రామ్, త్రినాథ రావు ముగ్గురికి ఈ సినిమా హిట్ అవసరం ఎంతో ఉంది. ఇకపోతే హలో గురు ప్రేమ కోసమే సినిమా అక్టోబర్ 18 విడుదల కాబోతుంది.

Similar News