40 కోట్ల క్లబ్బులోకి

మన తెలుగు స్టార్ హీరోస్ కి 40 కోట్లు షేర్ అంటే మాములు విషయం కాదు. కానీ స్టార్ హీరోస్ కి అతీతంగా సెన్సషనల్ హీరో విజయ్ [more]

Update: 2019-08-20 09:11 GMT

మన తెలుగు స్టార్ హీరోస్ కి 40 కోట్లు షేర్ అంటే మాములు విషయం కాదు. కానీ స్టార్ హీరోస్ కి అతీతంగా సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాతో ఈ మార్క్ ని చాలా అవలీగా దాటేశాడు. నాని కి కూడా ఇప్పటివరకు ఇంత రాబట్టలేకపోయాడు. కానీ మరో హీరో ఈ మార్క్ ని లేటెస్ట్ గా క్రాస్ చేసాడు. అతనే రామ్ పోతినేని.

ఇస్మార్ట్ శంకర్ తో…

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ 40 కోట్ల 5 లక్షల రూపాయల షేర్ ను సాధించాడు. అది కూడా 32 రోజుల్లో. రామ్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ షేర్. గ్రాస్ పరంగా ఇప్పటివరకు 82 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా ఈమూవీ 21 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే ఈసినిమా ఆల్రెడీ 20 కోట్లు ప్రాఫిట్ లో ఉంది. ఈమూవీ ని పూరి అండ్ ఛార్మి ఇద్దరు కలిసి నిర్మించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News