నెక్స్ట్ హీరో సెట్ అవలేదు!!

భీష్మ సినిమాతో భారీ హిట్ అందుకున్న నితిన్ మాత్రం వెంకీ అట్లూరి రంగ్ దే సినిమాతో బిజీ కాగా… కరోనా లాక్ డౌన్ రంగ్ దే సినిమా [more]

Update: 2020-05-03 09:59 GMT

భీష్మ సినిమాతో భారీ హిట్ అందుకున్న నితిన్ మాత్రం వెంకీ అట్లూరి రంగ్ దే సినిమాతో బిజీ కాగా… కరోనా లాక్ డౌన్ రంగ్ దే సినిమా షూటింగ్ కి బ్రేక్ వేసింది. ఇక నితిన్ ఓకె కానీ… భీష్మ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమా గురించిన ఆలోచన చెయ్యటం లేదా? లేదంటే ఎవరన్నా హీరోలను అప్రోచ్ అయ్యాడా ? అనే ప్రశ్నకు వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సమాధానం చెప్పాడు. తాను ఇంకా స్క్రిప్ట్ వర్క్ లోనే ఉన్నట్లుగా చెప్పాడు. భీష్మ సినిమా విడుదలయ్యాక వెంకటేష్ గారు సినిమా బావుంది అని… తర్వాత చిరు సినిమా చూసి ఫోన్ చేసి భీష్మ సినిమా చాలా బావుంది అని అభినందించారు అని చెప్పిన వెంకీ కుడుముల.. చిరు గారు భీష్మ చూసి ప్రశంశించడం చాలా గొప్ప విషయమని చెప్పాడు.

ఇక నితిన్ తనకు త్రివిక్రమ్ గారితో అ… ఆ సినిమా చేసినప్పటినుండి పరిచయం అని, పూరి జగన్నాధ్ గారి అమ్మానాన్న తమిళమ్మాయి సినిమా చూసినప్పటినుండి పూరి కి ఫ్యాన్ అయ్యానని చెప్పాడు. ఇక భీష్మ సినిమాకన్నా ముందు ఛలో సినిమా హీరో నాగ శౌర్య తో విభేదాలేమి లేవని, అవి ఇప్పుడు మాట్లాడాల్సిన ఆవరసం లేదన్నాడు. భీష్మ తర్వాత మంచి కథ రెడీ చేస్తున్నా అని.. పూర్తి స్క్రిప్ట్ అయ్యాక కథకు సరిపోయే హీరోని అప్రోచ్ అవుతానని చెబుతున్నాడు వెంకీ కుడుముల. 

Tags:    

Similar News