పాపం నిఖిల్ కదా?

స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో హీరోగా క్రేజ్ సంపాదించిన నిఖిల్ టైమ్ అస్సలు బాగోలేదు. గత ఏడాది నిఖిల్ నటించిన అర్జున్ సురవరం విడుదల [more]

Update: 2019-11-13 05:53 GMT

స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో హీరోగా క్రేజ్ సంపాదించిన నిఖిల్ టైమ్ అస్సలు బాగోలేదు. గత ఏడాది నిఖిల్ నటించిన అర్జున్ సురవరం విడుదల విషయంలో వాయిదాల మీద వాయిదాలు పడి… సినిమాపై అసలు క్రేజ్ లేకుండా పోయింది. ఇక కార్తికేయ 2 సినిమా షూటింగ్ కూడా బ్రేక్ ల మీద బ్రేకులు పడడంతో.. నిఖిల్ మార్కెట్ పడిపోయింది అనే కారణంతో.. కార్తికేయ 2 బడ్జెట్ లో నిర్మాతలు కొత పెట్టారనే టాక్ కూడా మొదలైంది. ఇకపోతే అర్జున్ సురవరం సినిమాని ఈనెలాఖరులో విడుదల చేస్తున్నట్లుగా నిఖిల్ తో పాటు నిర్మాతలు కూడా ప్రకటించారు. అయితే సినిమా విడుదల అన్నారు కానీ.. ఎక్కడా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవ్వలేదు.

అయితే ఇప్పుడు కూడా అనుకున్న డేట్ కి సినిమా విడుదలవుతుందా.. లేదా.. అనేది డౌట్. ఎందుకంటే అర్జున్ సురవరం సినిమా విషయంలో నిఖిల్ చాలా సైలెంట్ గా ఉన్నాడు. ఇక నిర్మాతలు కూడా సినిమా గురించి పట్టించుకోవడం లేదు. అసలు సినిమా ఇప్పటికైనా విడుదలవుతుందో.. లెదో.. అనే డౌట్ వారికీ కూడా ఉండి .. ఇలా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్నారేమో అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ చేస్తున్నారు. హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న నిఖిల్ ఇప్పుడు కష్టకాలంలో పడ్డాడు. నిఖిల్ కి ఇటు చూస్తే అర్జున్ సురవరం టెన్షన్, అటు చూస్తే కార్తికేయ 2 టెన్షన్.

Tags:    

Similar News