నాని యూఎస్ లో సక్సెస్ అవ్వలేదా!!

Update: 2018-04-13 05:34 GMT

గత రెండుమూడేళ్ల నుండి నాని చేసిన అన్ని సినిమాలు హిట్ అవుతూ వచ్చాయి. దానికి తోడు నాని యూఎస్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. కథలు విషయంలో నాని డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకోవటంతో మనోడికి అక్కడ ఫాలోయింగ్ బాగానే పెరిగింది. దానిని క్యాష్ చేసుకునే ఉదేశంతో నాని లేటెస్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధం యూఎస్ లో రికార్డు స్థాయిలో ప్రీమియర్స్ వేశారు.

ఇలా జరిగిందేందబ్బా?

బాక్స్ ఆఫీస్ వద్ద నాని అలజడి సృష్టించటం ఖాయం అని అంతా అనుకున్నారు. తీరా రిజల్ట్ చూస్తే షాక్ కి గురవ్వాల్సిందే. బుధవారం వేసిన ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా కేవలం 155k డాలర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. నాని గత సినిమాతో పోల్చుకుంటే మరీ తక్కువగా కలెక్ట్ చేసింది. 'నిన్ను కోరి' సినిమా యూఎస్ లో 159k డాలర్స్...'నేను లోకల్' 160k డాలర్స్ కంటే చాలా తక్కువ ఫిగర్. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 304k కంటే ఎక్కువగా కలెక్ట్ చేస్తుంది అనుకుంటే అందులో సగం మాత్రమే కలెక్ట్ చేసి నిరాశపరిచాడు నాని. కృష్ణార్జున యుద్ధం అనుకున్న స్థాయిలో లేకపోవడమే వసూళ్లు ఇలా వచ్చాయి అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

Similar News