మరోసారి స్టామినా చూపిన నాని

క్రికెటర్ గా కనిపించిన నాని తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. జెర్సీ సినిమాతో అందరి మనసులు దోచుకున్న నాని సినిమా కలెక్షన్స్ తో కూడా అదేవిధంగా [more]

Update: 2019-04-24 08:54 GMT

క్రికెటర్ గా కనిపించిన నాని తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. జెర్సీ సినిమాతో అందరి మనసులు దోచుకున్న నాని సినిమా కలెక్షన్స్ తో కూడా అదేవిధంగా ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రేక్షకులని ఎమోషనల్ గా టచ్ చేసిన ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా వసూళ్ల జోరు చూపిస్తుంది.

2 మిలియన్ మార్క్ ఖాయం

నానికి ఓవర్సీస్ లో మంచి మార్కెటే ఉంది. నాని యావరేజ్ సినిమాలు సైతం అక్కడ 1 మిలియన్ మార్కును దాటాయి. లేటెస్ట్ గా మరోసారి జెర్సీ సినిమాతో 1 మిలియన్ మార్కును క్రాస్ చేసాడు. 5 రోజుల్లో ఓవర్సీస్ లో ఈ సినిమా 1 మిలియన్ మార్కును క్రాస్ చేసింది. ఓవర్సీస్ లో నాని ఈ ఫీట్ ను సాధించడం ఇది ఆరోసారి. ఫుల్ రన్ లో ఈ సినిమా 2 మిలియన్ మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. నానికే కాకుండా ఈ సినిమా డైరెక్టర్ కి మంచి పేరు వస్తుంది.

Tags:    

Similar News