నాని పై రూమర్స్ నిజం కాదు!

Update: 2018-12-22 04:30 GMT

మొన్నటివరకు మినిమం గ్యారంటీ గా ఉన్న హీరో నాని గత రెండు మూడు చిత్రాల నుండి ఆ ఫామ్ కోల్పోయాడు. దాంతో తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాని. కొత్త డైరెక్టర్ తో 'జెర్సీ' అనే సినిమా చేస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది.

విక్రమ్ సినిమాతో.....

ఇది సెట్స్ మీద ఉండగానే నాని తన తరువాత సినిమాను లైన్ లో పెట్టేసాడు. 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇది అధికారంగా ప్రకటించారు కూడా. 'జెర్సీ' తరువాత విక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నాడు నాని. అందుకు సంబంధించిన పనులను ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో పదే పదే నాని వేలు పెడుతున్నాడని గత కొన్ని రోజులు నుండి వార్తలు వస్తున్నాయి.

విక్రమ్ వివరణతో.....

ఈనేపధ్యంలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ స్పందిస్తూ..."నాని స్క్రిప్ట్ విషయంలో ఎంతమాత్రం జోక్యం చేసుకోవడం లేదనీ, స్క్రిప్ట్ పనుల్లో నాని ఇంవోల్వ్ కావట్లేదని..అవ్వని రూమర్సే అని కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి పనులు జరుగుతున్నాయనీ, త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని అన్నాడు". దింతో రూమర్స్ కి చెక్ పడినట్లయింది.

Similar News