96 తెలుగుకి హీరోహీరోయిన్లు దొరికేసారా..?

Update: 2018-12-13 13:13 GMT

రెండు నెలల క్రితం తమిళంలో ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్స్ లోకి దిగి పలు సంచలనాలు సృష్టించిన 96 సినిమా సందడి ఇంకా ముగియలేదు. 96 తమిళ ట్రైలర్ విడుదల చేసిన వెంటనే ఆ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్న దిల్ రాజు.. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ సినిమాని తెలుగులో రీమేక్ ప్లాన్ చేసాడు. అయితే దిల్ రాజు 96 హక్కులు కొని భద్రపరిచారు కానీ... ఆ సినిమాలో హీరో, అంటే ఒరిజినల్ 96లో హీరో విజయ్ సేతుపతి కేరెక్టర్ కి, హీరోయిన్ గా మెయిన్ లీడ్ లో నటించిన త్రిష కేరెక్టర్ కి ఏ హీరో, హీరోయిన్ ను తీసుకోవాలో తెలియక కిందా మీదా పడుతున్నాడు. ముందుగా ఆ సినిమా చూసిన నాని ఆ సినిమాలో హీరోగా చేయలేనని.. నిర్మాణంలో భాగస్వామినవుతానని దిల్ రాజుతో చెప్పడు. ఇక మెగా హీరో అల్లు అర్జున్ కూడా తమిళ 96 సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ చూపించినా హీరోగా చెయ్యడానికి సాహసించలేదు.

హీరోహీరోయిన్లను ఫిక్స్ చేసేశారు...

తాజాగా ఈ సినిమాకి మాస్ హీరో గోపీచంద్ ఫిక్స్ అయ్యాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో నడిచాయి. అయితే గోపీచంద్ కూడా 96లో నటించడం లేదనేది లేటెస్ట్ న్యూస్. తాజాగా దిల్ రాజుకి హీరో, హీరోయిన్స్ దొరికేశారట. 96లో నటించబోయే ఆ హీరో మరెవరో కాదు.. కుర్ర హీరో శర్వానంద్ అంట. ఇక త్రిష పాత్రలో హాటెస్ట్ హీరోయిన్ సమంత నటిస్తుందట. ఎప్పటినుండో తమిళ 96లో త్రిష రోల్ తెలుగులో సమంత ప్లే చేస్తుందని ప్రచారం జరుగుతుంది. తమిళంలో ఎంతగానో మెప్పించిన త్రిష రోల్ కి సమంతనే న్యాయం చేస్తుందంటున్నారు. అందుకే శర్వానంద్, సమంతని 96 తెలుగు రీమేక్ కోసం ఫైనల్ చేశారట. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి మొదలు కాబోతుందంటున్నారు. త్వరలోనే 96 తెలుగు రీమేక్ నటీనటులు ఇతరత్రా విషయాలు అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తారట.

Similar News