అజిత్ అదరగొట్టాడుగా..!

Update: 2018-10-09 08:32 GMT

వివేగం సినిమా యావరేజ్ తో ఉన్న అజిత్ తన తదుపరి సినిమా అయిన విశ్వాసం సినిమాని కూడా తనకి అచ్చొచ్చిన దర్శకుడు శివతోనే చేస్తున్నాడు. అజిత్ - దర్శకుడు శివ కాంబో హిట్ కాంబో. అందుకే వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా మీద ట్రేడ్ లో, తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. ఇక అజిత్ కి తమిళనాట ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. శివ - అజిత్ కాంబోలో వచ్చిన వీరం బ్లాక్ బస్టర్ హిట్ కాగా... గత ఏడాది వచ్చిన వివేగం మాత్రం యావరేజ్ హిట్ అయ్యింది. వివేగం యావరేజ్ హిట్ అయినా.. అజిత్ స్టామినాతో.. ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి.

భారీ ధరలకు హక్కులు...

ప్రస్తుతం అజిత్ - నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వాసం సినిమా మీద భారీ అంచనాలున్నాయి. వివేగం యావరేజ్ హిట్ అయినప్పటికీ... విశ్వాసం సినిమా మీద ఆ ఎఫెక్ట్ పడలేదు. దానికి రుజువులు కూడా కనబడుతున్నాయి. ఈ సినిమాకి తమిళనాట థియేట్రీకల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయనే టాక్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేజేఆర్ స్టూడియోస్ 48 కోట్లకు ఈ హక్కులను దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది.

Similar News