గాయపడ్డ విశాల్…అసలు ఏమైంది అంటే..!

నటుడు విశాల్ షూటింగ్ లో గాయపడ్డాడు. అప్రమత్తం అయిన టీం అయనను వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అయితే విశాల్ కి దెబ్బలు [more]

Update: 2019-03-28 11:29 GMT

నటుడు విశాల్ షూటింగ్ లో గాయపడ్డాడు. అప్రమత్తం అయిన టీం అయనను వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అయితే విశాల్ కి దెబ్బలు తగిలింది ఇక్కడ కాదు. టర్కీలో. సుందర్ డైరెక్షన్ లో విశాల్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించి షూటింగ్ టర్కీలో జరుగుతుంది. అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసాడు డైరెక్టర్ సుందర్. సీక్వెన్స్ లో భాగంగా బైక్‌పై వేగంగా వెళ్తున్న విశాల్ అనుకోకుండా బైక్ పై నుండి పడిపోయారు. వెంటనే టీం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లింది.

ఆగిపోయిన షూటింగ్

గాయాలు కొంచెం బలంగా తగలడంతో కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు సమాచారం. దాని వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే విషయం తెలుసుకున్న విశాల్ కాబోయే భార్య వెంటనే టర్కీ వెళ్లడానికి ట్రై చేసింది. కానీ గాయాలు చిన్నవే అని కుటుంబసభ్యులు చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే విశాల్ అక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటారా లేక ఇండియా వచ్చేసి రెస్ట్ తీసుకుంటారా అని తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News