హలో గురు ప్రేమకోసమే మొదటి రోజు కలెక్షన్స్!!

Update: 2018-10-19 06:01 GMT

త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రామ్ - అనుపమపరమేశ్వరం జంటగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం ఈ దసరా కానుకగా నిన్న గురువారం విడుదలైంది. సినిమా మొదటి షోకే ప్రేక్షకులనుండి మిక్స్ డ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాతో రామ్ యావరేజ్ హిట్ అందుకున్నాడనే చెప్పాలి. సినిమాలో రామ్ ఎనర్జీ నటన, అనుపమ క్యూట్ లుక్స్, కామెడీ, కొన్ని డైలాగ్స్ పరంగా బావున్నప్పటికీ... రొటీన్ కథ, దేవిశ్రీ మ్యూజిక్, ఎడిటింగ్, త్రినాథ రావు డైరెక్షన్, ఎక్కడా ఆసక్తికరంగా ట్విస్ట్ లు లేకపోవడంతో సినిమాకి యావరేజ్ టాక్ పడడం జరిగింది. ఇక రామ్ హలో గురు ప్రేమ కోసమే చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.82 కోట్లు కొల్లగొట్టింది. ఏరియా వైజ్ గా మొదటిరోజు కలెక్షన్స్ మీకోసం.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 1.55

సీడెడ్ 0.50

నెల్లూరు 0.13

కృష్ణా 0.29

గుంటూరు 0.35

వైజాగ్ 0.48

ఈస్ట్ గోదావరి 0.27

వెస్ట్ గోదావరి 0.25

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 3.82 కోట్లు

Similar News