‘నువ్వు నాకు న‌చ్చావ్‌’ ఫార్ములాతో వస్తున్న రామ్

Update: 2018-08-12 06:38 GMT

వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు న‌చ్చావ్‌’ సినిమా గుర్తు ఉందిగా? అందులో వెంకీ నిశ్చితార్థ‌మై, పెళ్లికి రెడీగా ఉన్న అమ్మాయి ఇంటికి వెళ్లి అక్కడ ఆమెతో లవ్ లో పడతాడు. పెద్దలు అంగీకారంతో క్లైమాక్స్ లో వారి పెళ్లి జరుగుతుంది. అయితే ఇప్పుడు సేమ్ అదే ఫార్ములాతో రామ్ మనముందుకు రానున్నాడు. అతను లేటెస్ట్ గా నటించే ‘హ‌లో గురూ ప్రేమ కోస‌మే’ మూవీ స్టోరీ కూడా అదే అంట.

ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో కూడా నిశ్చితార్థ‌మై, పెళ్లికి రెడీగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు రామ్. కాకపోతే ఇక్కడ పందెం అనే కాన్సెప్ట్ జోడించారు. హీరోయిన్ తండ్రితో వేసిన పందెం కోసమే..హీరోయిన్ ని ప్రేమలోకి దించడానికి ట్రై చేస్తాడట. మరి ఆ ప్రయత్నంలో హీరో సక్సెస్ అయ్యాడా?లేదా? అనేదే కథ.

సేమ్ ఇటువంటి లైన్ తోనే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే కొత్తగా చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. మరి ఇందులో డైరెక్టర్ త్రినాధ‌రావు న‌క్కిన ఎలా చూపించాడో తెలియాలి. ఇక 'సినిమా చూపిస్త మావ‌', 'ఎంసీఏ'తో యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న త్రినాధ‌రావు ఈ సినిమాలో కామెడీని బాగానే వర్క్ అవుట్ చేసాడని తెలుస్తుంది. ఈ సినిమాకు కామెడీ ఎలెమెంట్స్ హైలైట్ అవుతాయి అని చెబుతున్నారు. కామెడీ వర్క్ అవుట్ అయితే సినిమా స్టోరీ పాసైపోయే ఛాన్సుంది

Similar News