ఎంత చూపించినా పనిజరగదు

కుమారి 21 ఎఫ్ తో కత్తిలాంటి అమ్మాయి ఇండస్ట్రీకి దొరికింది.. ఇక ఆ అమ్మాయి గ్లామర్ తో టాలీవుడ్ ని ఓ ఊపు ఊపుతుంది అనుకున్నారు.. కానీ [more]

Update: 2019-06-13 07:00 GMT

కుమారి 21 ఎఫ్ తో కత్తిలాంటి అమ్మాయి ఇండస్ట్రీకి దొరికింది.. ఇక ఆ అమ్మాయి గ్లామర్ తో టాలీవుడ్ ని ఓ ఊపు ఊపుతుంది అనుకున్నారు.. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు అవకాశాల కోసమే అర్రులు చాచాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పాటికే ఆ అమ్మాయెవరో మీరు గెస్ చేసి ఉండాలే. హా ఆమె హెబ్బా పటేల్. పాపం హెబ్బా ని చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. ఎంత గ్లామర్ ఉన్నా ఆమెకి లక్కనేది కలిసి రావడమే లేదు. ఏంజిల్ సినిమాతో అట్టర్ ప్లాప్ కొట్టిన హెబ్బా పటేల్ కి రాజ్ తరుణ్ తో ఎన్ని సినిమాలు చేసిన హిట్ అనేది లేకుండా పోయింది.

ప్రస్తుతం అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తూ అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాలం గడుపుతుంది. క్లివేజ్ అందాలతో మతులు పోగొడుతున్న హెబ్బా కి ఎవరైనా పిలిచి అవకాశమిస్తే.. తన వంతు అందాల ఆరబోతతో రెచ్చిపోయేలా కనబడుతుంది. పాపం ఇంత గ్లామరున్న ఎందుకు అన్నట్టుగా ఉంది అమ్మడు వ్యవహారం. ఇక సోషల్ మీడియాలో హెబ్బా పటేల్ పోస్ట్ చేసే పిక్స్ చూస్తే యూత్ మాత్రం చొంగలు కారుస్తుంది కానీ.. దర్శకనిర్మాతలకు హెబ్బా అందాల మీద నమ్మకం లేదు అందుకే అమ్మడుకు అవకాశాలు ఇవ్వడానికి జంకుతున్నారు

Tags:    

Similar News