కిస్సులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది!!

Update: 2018-07-14 08:23 GMT

టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ 'అలా ఎలా' లో చాల డీసెంట్ గా ట్రెడిషనల్ గా కనిపించిన హెబ్బా పటేల్ 'కుమారి 21 ఎఫ్' లో బోల్డ్ గా బుల్లి బుల్లి నిక్కర్లతో అందరి మనసులను కొల్లగొట్టేసింది. ఆ సినిమాలో రాజ్ తరుణ్ తో కలిసి రెచ్చిపోయిన హెబ్బా పటేల్ తర్వాత వరసగా.. యావరేజ్ హిట్స్ అందుకుంది. కానీ ఏమైందో ఏమో ఒకేసారిగా హెబ్బా కి హీరోయిన్ గా భారీ బ్రేక్ వచ్చేసింది. అస్సలు అవకాశాలే లేకుండా పోయాయి. అలాంటి సమయాల్లో హెబ్బకి టాలీవుడ్ బుల్లితెర మీద యమా క్రేజ్ సంపాదించిన బిగ్ బాస్ లోకి అడుగుపెడుతుందనే న్యూస్ గత రెండు రోజులుగా తెగ ప్రచారం జరుగుతుంది. ఇకపోతే 'ఏంజెల్' తో ప్లాప్ అందుకున్న హెబ్బా ప్రస్తుతం '24 కిస్సెస్' అనే మూవీ లో నటిస్తుంది.

ప్రొఫెసర్ తో ప్రేమలో పడే....

మరి 24 ముద్దులు సినిమాలో హెబ్బా నిజంగానే 24 ముద్దులు పెడుతుందా అనే అనుమానం అందరిలో ఉంది. కానీ హెబ్బా మాత్రం గ్లామర్ పరంగా ఎక్కడా తగ్గనట్టుగానే... ఈ '24 కిస్సెస్' సినిమాలో హెబ్బా నిజంగానే ఈ '24 కిస్సెస్' పెట్టేసిందట. ఇకపోతే హెబ్బా పటేల్ ఈ సినిమాలో ప్రొఫెసర్ తో ప్రేమలో పడే మీడియా స్టూడెంట్ గా నటించింది. నిజంగా ఈ '24 కిస్సెస్' టైటిల్ లో చెప్పేసినట్టు హెబ్బా ఈ సినిమాలో మొత్తం 24 ముద్దులూ పెట్టిందట. అయితే ఈ రోల్ గురించి మొదట చెప్పినప్పుడు తాను ఈ పాత్రకి న్యాయం చేయగలుగుతానా లేదా అని ఫీలయ్యానని.... స్టోరీ మొత్తం విన్నాక కాన్ఫిడెన్స్ రావడంతో ఈ సినిమా చేశానని చెబుతోంది హెబ్బా.

ముద్దు ముద్దుకూ ఒక కారణం....

ఇక ఈ సినిమాలో వచ్చే ప్రతి ముద్దు సీన్ వెనుక ఎదో ఒక కారణం ఉంటుందని.. అందుకే ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడం జరిగిందని.. ఇక తాను నటించే సినిమాల్లో కథ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాల్లో నటించడానికి రెడీ అని గ్లామర్ కే కాదు ముద్దులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. మరి గ్లామర్ గేట్లు తెరిచినా లాభం లేదనుకున్న హెబ్బా ఇలా కిస్సులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. చూద్దాం ఈ కిస్సులతో అయినా అమ్మడు ఫెట్ మారుతుందేమో అనేది.

Similar News