ఆ హిట్లతో ఆమె ఆనందం చూడూ…

ఈ ఏడాది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం సాహో. ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా నటించిన ఈమూవీ హిందీ తో పాటు తెలుగు. [more]

Update: 2019-09-12 08:55 GMT

ఈ ఏడాది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం సాహో. ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా నటించిన ఈమూవీ హిందీ తో పాటు తెలుగు. తమిళం, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో ఈమూవీ నెగటివ్ టాక్ తెప్పించుకుని కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. కానీ అనూహ్యంగా హిందీలో ఈ చిత్రం హిట్ మూవీ గా నిలిచింది. బాలీవుడ్ లో ఈమూవీ ఏకంగా రెండు వారాలకు గాను 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ప్రభాస్ మార్కెట్ అక్కడ స్టాండర్డ్ గానే ఉంది. ఈ హిట్ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది శ్రద్ద.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్…..

సాహో లో ఆమె యాక్షన్ సీన్స్ తో పాటు గ్లామర్ తో అలరించింది. ఇక శ్రద్ద నటించిన మరో చిత్రం ఛిచ్చోరే కూడా మంచి విజయం వైపుగా దూసుకెళుతుంది. ఐదురోజులు గాను ఈమూవీ 54 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు హిట్ అవ్వడంతో శ్రద్ద చాలా ఆనందంగా ఉంది. ఇక ఈమూవీ మన తెలుగు హీరో నవీన్ పోలిశెట్టి నటించారు.

 

 

 

 

Tags:    

Similar News