‍Naresh : ముండమోసినట్లు ఎందుకంత ఏడుపు?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా రెండు ప్యానెళ్ల మధ్య వేడి తగ్గడం లేదు. నరేష్ తాజా వ్యాఖ్యలతో అది మరింత బయటపడింది. నిన్న 11 మంది [more]

Update: 2021-10-13 06:49 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా రెండు ప్యానెళ్ల మధ్య వేడి తగ్గడం లేదు. నరేష్ తాజా వ్యాఖ్యలతో అది మరింత బయటపడింది. నిన్న 11 మంది ప్రకాష్ రాజ్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై నరేష్ స్పందిస్తూ ఆ రాజీనామాలపై కొత్తగా ఎన్నికైన ప్యానెల్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తనకు మా తో ఆరేళ్ల అనుబంధం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఎందుకంత ఏడుపు?

కొత్తగా ఎన్నికైన కార్యవర్గాన్ని మా సభ్యులు ఎన్నుకున్నారన్న విషయాన్ని నరేష్ గుర్తు చేశారు. ఏదో పోయిందని ఎందుకంత ఏడుపు అని ఆయన ప్రశ్నించారు ముండమోసినట్లు ఏడవటం అవసరమా అని నరేష్ ఎద్దేవా చేశారు. అందరూ కలసి పని చేసి మా సభ్యులకు సేవలందించాలని నరేష్ కోరారు. మా ను సేవాసంస్థగానే ప్రతి ఒక్కరూ చూడాలని నరేష్ కోరారు.

Tags:    

Similar News